మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవాలయాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. ఈ సినిమాలో మొదటినుంచీ వార్తల్లో నిలుస్తున్న అంశం సినిమాలో ఓ మెయిన్ క్యారెక్టర్ గురించే. చిరంజీవి ఆ పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని భావించారు. ఇప్పుడు ఈ అంశంపై దాదాపు క్లారిటీ వస్తోంది. రామ్ చరణ్ ఆ పాత్ర చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతోపాటు మరొకొత్త వార్త కూడా రౌండ్ అవుతోంది.
సినిమాలో కీలకమైన ఈ పాత్ర కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ ఉండదని.. చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్టు తెలుస్తోంది. సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రతోపాటు చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే.. మొదటి నుంచీ చిరంజీవి ఈ పాత్రపై శ్రద్ధ పెట్టారని.. ఈ పాత్రను చరణ్ తో చేయించాలనే భావించారని అంటున్నారు. అయితే.. చరణ్ కు ఆర్ఆర్ఆర్ షూటింగ్ డేట్స క్లాష్ కాకూడదనే టీమ్ ఇన్నాళ్లూ దీనిపై అంత క్లారిటీగా లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వేగంగా జరగడం, ఆచార్య షూటింగ్ ఇటివలే ప్రారంభమవడంతో చరణ్ కు గ్రీన్ సిగ్నల్ దొరికిందని అంటున్నారు.
దీంతో ఆచార్యలో కీలక పాత్రను చరణ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కొరటాల శివ చెప్పిన మాటలు కీలకమయ్యాయని కూడా అంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కలసి మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో కనిపించినా అవి కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ గా మిగిలాయి. ఈసారి ఇద్దరూ కలసి దాదాపు మల్టీస్టారర్ గా.. ఫుల్ లెంగ్త్ పాత్రలతో కలిసి చేస్తున్నారని చెప్పాలి. ఇది మెగా ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చే విషయంగా చెప్పాల్సిందే. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!