సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహర్షి’. ఏప్రిల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పొల్లాచి షెడ్యూల్ పూర్తయితే మహర్షి సినిమా దాదాపు 80% కంప్లీట్ అయినట్లే. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ ఘట్టమనేని అభిమానుల నుంచి భారీ షాక్ తగిలింది. అభిమానం పేరుతో మహర్షి షూటింగ్ స్పాట్ కి వెళ్లిన కొందరు, మహేశ్ బాబు లుక్ ని రివీల్ చేసేశారు.
నిజానికి పొల్లాచి షెడ్యూల్ లో చేస్తున్న సీన్స్ మహర్షి సినిమాకి ప్రధాన బలం, ఇవే లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ తలపెట్టుకొని కూర్చుంది. ఇక నుంచి సెట్స్ కి వచ్చే వాళ్లు సెల్ ఫోన్స్ తీసుకోని రాకూడదని ఆంక్షలు పెడుతోంది. ఇదిలా ఉంటే లీక్ అయిన ఫొటోస్, వీడియోస్ చూస్తే మహేశ్ బాబు మరో శ్రీమంతుడు లాంటి సినిమా తీస్తున్నాడని అర్ధమవుతుంది. అదెలా అంటే మహర్షి సినిమాలో మహేశ్ పెద్ద వ్యాపార సామ్రాజ్య అధినేతగా కనిపించడంతో పాటు స్నేహితుడి కోసం పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేసే పాత్రలో కనిపించబోతున్నాడు.
శ్రీమంతుడు కూడా దాదాపు ఇదే స్టోరీలైన్ తో నడుస్తుంది. కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించిన ఆ సినిమా హిట్ అయ్యింది కదాని బెంచ్ మార్క్ సినిమాకి కూడా అదే రూట్ ఫాలో అయ్యిఎదో వండేస్తే సరిపోతుందిలే అనుకుంటే అంతకుమించిన పొరపాటులేదు. ప్రేక్షకులు ప్రతిసారీ ఒకే కథని చూడరు, ఈ విషయం స్పైడర్ లాంటి సినిమాని చేసిన మహేశ్ కి చాలా బాగా తెలుసు. మరి అందరూ అనుకుంటున్నట్లు మహర్షి సినిమాని శ్రీమంతుడికి ఎక్స్టెండెడ్ వెర్షన్ లా ఉంటుందా లేక కొత్తగా ఉంటుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.
previous post
next post
Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!