Pushpa 2: 2021 డిసెంబర్ నెలలో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” భారీ రేంజ్ లో హిట్ కావడం తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. “పుష్ప” మొదటి భాగంలో తీసేయడానికి ఏదీ లేదు. స్టోరీ, పాటలు, స్టెప్పులు, డైలాగులు అన్నీ కూడా దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ “పుష్ప” విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. స్క్రిప్ట్ కోసం దాదాపు ఏడాదికి పైగానే టైం తీసుకున్న సుకుమార్ ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేశారు. మొదటి షెడ్యూల్ విశాఖపట్నం లో జరిగింది. అక్కడ ఇంట్రడక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఓ హైలెట్ గురించి ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. పుష్ప మొదటి భాగంలో చిత్తూరు జిల్లా స్టేట్ వైడ్ స్మగ్లర్ గా బన్నీని చూపించడం జరిగింది. కానీ పుష్ప రెండో భాగంలో అంతర్జాతీయ స్మగ్లర్ గా చూపించబోతున్నారట. ఈ క్రమంలో జపాన్ భాష కూడా బన్నీ మాట్లాడనున్నట్లు సమాచారం. జపాన్ భాష మాట్లాడే సమయంలో బన్నీ పడే అవస్థలు… చాలా కామెడీని తలపిస్తాయంట. మొదటి భాగంలో చిత్తూరు యాసలో.. ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది.
అయితే ఇప్పుడు రెండో భాగంలో అంతర్జాతీయ స్మగ్లర్ కావటంతో జపాన్ భాషలో అల్లు అర్జున్ కీ అదిరిపోయే డైలాగులు సుకుమార్ రాసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. “పుష్ప” మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఎక్కువ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!