Julayi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో జులాయి ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్రను పోషించగా.. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శ్రీముఖి, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలను పోషించారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
2012 ఆగస్టు 9న విడుదలైన జులాయి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, కామెడీ ట్రాక్, సోనూసూద్ విలనిజం, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 1,600 థియేటర్లలో విడుదలైన జులాయి మూవీ లాంగ్ రన్ లో రూ. 37 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది.
అలాగే ఈ చిత్రం ఉత్తమ పాపులర్ ఫీచర్ ఫిల్మ్‌గా నంది అవార్డును అందుకుంది. జులాయి మూవీని సాగసం పేరుతో తమిళంలోకి రీమేక్ కూడా చేశారు. అయితే ఈ చిత్రంలో సోనూసూద్ విలన్ గా నటించాడు. బిట్టు పాత్రలో అదరగొట్టారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. జులాయిలో విలన్ క్యారెక్టర్ గా ఫస్ట్ ఛాయిస్ సోసూసూద్ కాదు. మొదట ఆ పాత్రలో ఓ టాలీవుడ్ హీరో వద్దకు వెళ్లిందట. ఆ హీరో మరెవరో కాదు.. ఏఎన్నార్ గారి మనవడు యార్లగడ్డ సుమంత్.
జులాయిలో విలన్ గా సుమంత్ ను తీసుకోవాలని మొదట త్రివిక్రమ్ భావించారట. కానీ ఆ సమయంలో ఆయన హీరోగా కొన్ని చిత్రాలు చేస్తున్నారు. అటువంటి సమయంలో విలన్ గా చేసేందుకు సుమంత్ ఇంట్రెస్ట్ చూపలేదు. సున్నితంగా జులాయిని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత కన్నడ స్టార్ సుదీప్ ను తీసుకోవాలని అనుకోగా.. బిజీ షెడ్యూల్ వల్ల ఆయన డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారు. ఫైనల్ గా త్రివిక్రమ్ సోనూసోన్ ను ఎంపిక చేశారట.