హీరో డాక్టర్ రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే రాజశేఖర్ ఇటీవల కారును వేగంగా నడిపి ఔటర్ రింగురోడ్డులో యాక్సిడెంట్‌కి గురయ్యారు. చిన్న చిన్న గాయాలతో ఆయన బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన కారును 21 సార్లు వేగంగా నడిపినట్లు గుర్తించారు. అందులో ఆయన అత్యధికంగా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల సహయంతో గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిఫార్స్ చేశారని టాక్. త్వరలోనే ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆర్టీఏ క్యాన్సిల్ చేస్తుందని టాక్.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!