SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో “SSMB 28” అధికారికంగా గత ఏడాది మహేష్ పుట్టినరోజు నాడు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. మే నెలలో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు హైదరాబాద్(Hyderabad)లో జరిగాయి. ఆ సమయంలో జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అని పేర్కొన్నారు. ఇక అదే సమయంలో మహేష్ బాబు.. “సర్కారు వారి పాట”(Sarkaru Vari Pata) ప్రమోషన్ కార్యక్రమాలలో… భాగంగా అభిమానులకు లెటర్ రాస్తూ.. జూన్ నెల నుండి త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం జూన్ నెల.. చివరికి వచ్చేయడం జరిగింది. మరోపక్క మహేష్ బాబు ఇంకా కుటుంబంతో యూరప్ ట్రిప్ లోనే ఉన్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ “SSMB 28” షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇదిలా ఉంటే అసలు సినిమా ఆలస్యం రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. మేటర్ లోకి వెళ్తే స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఇటీవల మార్పులు చేసినట్లు అందువల్ల… రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదట. చారిత్రక నేపథ్యంలో.. సినిమా స్క్రిప్ట్ ఉండనున్నట్లు… మహేష్ బాబు ని.. దీపాబ్రీనయంలో త్రివిక్రమ్ చూపించినున్నట్లు సమాచారం.
వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతడు(Athadu), ఖలేజా(Khaleja) వచ్చాయి. మహేష్ కెరియర్ లో నటనపరంగా ఈ రెండు సినిమాలు ట్రేడ్ మార్క్ గా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయి. కలెక్షన్ పరంగా రెండూ కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయినా టెలివిజన్ లో మాత్రం ఇప్పటికీ కూడా.. ఈ రెండు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో రాబోతున్న మూడో సినిమాలో మహేష్ నీ త్రివిక్రమ్ ఏ విధంగా చూపిస్తాడు అనేది సస్పెన్స్ గా నెలకొంది. అయితే చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా కావడంతో.. రెండు పాత్రలలో గతంలో మహేష్ బాబు తర్వాత వర్తమానంలో మహేష్ బాబుని రెండు విధాలుగా చూపించనునట్లు.. కొత్త ఐడియాతో త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!