NTR 30 : ఎన్టీఆర్ 30..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్‌లతో ఆచార్య సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్‌కి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కనిపించబోతున్నారు. ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో కొమురం భీం గా నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటు కొరటాల అటు ఎన్టీఆర్ ఈ సినిమాలను కంప్లీట్ చేశాక వీరి కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కనుంది ఎన్టీఆర్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ ఎన్టీఆర్ 30గా రానున్న ఈ మూవీని కొరటాల ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నాడు. గతంలో కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.దాంతో మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించగానే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
NTR 30 : ఎన్టీఆర్ 30లో నటించే ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరనేది ఓ క్లారిటి రానుందని తెలుస్తోంది.
పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇందులో నటించే ఆ ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ ఉన్నవాళ్లనే తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ పూజా హెగ్డే – కియారా అద్వానీ పేర్లు బాగా వినిపించాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల వీరితో సినిమాలు చేశాడు కాబట్టి వీరినే తీసుకోవాలనుకున్నట్టు చెప్పుకున్నారు. కానీ వారికున్న వరుస ప్రాజెక్ట్స్ వల్ల ఇద్దరు నో చెప్పినట్టు సమాచారం. దాంతో రష్మిక మందన్న తో పాటు
మరో బాలీవుడ్ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారట. త్వరలో ఎన్టీఆర్ 30లో నటించే ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరనేది ఓ క్లారిటి రానుందని తెలుస్తోంది.