Pawan Mahesh: ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ సినిమాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది హీరోలు కలసి చేస్తున్నారు. బయోపిక్ సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో చాలామంది పవన్ మహేష్ కలసి ఒక సినిమాలో నటిస్తే చాలా బాగుంటుందని తిరుగులేని సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా చేయటం తనకి కూడా ఇష్టమే అంటూ మహేష్ బాబు ప్రముఖ టీవీ ఛానల్ లో ఓపెన్ గానే చెప్పేశారు.
ఇక అదే టైంలో ఈ ఇద్దరి హీరోలకు కామన్ ఫ్రెండ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తున్నట్లు అప్పట్లో కూడా వార్తలు రావడం జరిగాయి. కానీ ఆ తర్వాత వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తర్వాత తేలింది. ఇదిలా ఉంటే త్వరలో వీరిద్దరూ సినిమా చేస్తున్నట్లు సరికొత్త టాక్ లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినబడుతోంది. విషయంలోకి వెళ్తే మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పవన్ కళ్యాణ్ వ్యవహరించనున్నటు ఇండస్ట్రీ టాక్.
పవన్ కళ్యాణ్ ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. త్రివిక్రమ్ తో మంచి సత్సంబంధాలు ఉండటంతో.. ఆయన దర్శకత్వంలో వస్తున్న మహేష్ మూవీకి సహ నిర్మాతగా పవన్ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఈరోజు మహేష్ పుట్టినరోజు కావడంతో… మహేష్ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మహేష్ సినిమాకి సహ నిర్మాతగా పవన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్త రావటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.