Breaking: పవన్ కళ్యాణ్ అభిమానులకు తాజాగా భీమ్లా నాయక్ చిత్రబృందం పండగలాంటి వార్త తీసుకువచ్చింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న నాయక్ సినిమా జనవరి 12, 2022వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. కె. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. త్రివిక్రమ్ సంభాషణలు అందించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో హీరో రానా కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా రానాకు జోడిగా సంయుక్త మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.
Breaking : 5 కోట్ల వాచ్ తో ఎయిర్పోర్టులో అడ్డంగా దొరికిపోయిన హార్దిక్ పాండ్య
జనవరి 7న ఆర్ సినిమా విడుదల కానుండగా జనవరి 12న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సర్కారు వారి పాట ముందుగా జనవరి 13న రిలీజ్ చేద్దామనుకున్న చివరికి ఏప్రిల్ ఒకటో తారీకు సినిమాను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమా కూడా వాయిదా పడుతుందని భావించిన చివరికి మాత్రం సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నిలిచాడు.