NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ మళ్లీ దొరికాడు..! నెగ్గాల్సిన చోట తగ్గాడు… తగ్గకూడని చోట తలోంచాడు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రధాన పార్టీ అంటే అందరూ జనసేన పేరే చెబుతారు. ఏపీ బిజెపి ని అసలు చాలామంది పట్టించుకోని పరిస్థితి. జనసేన గత ఎన్నికల్లో ఒక్కటే సీటు సంపాదించి ఘోరపరాజయం చెందినప్పటికీ చాలా చోట్ల టిడిపి కి రావాల్సిన సీట్లను చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు తమకు తెలియకుడానే పెద్ద మేలు చేసింది. పవన్ ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఎలా ఉందో మొన్న ఎన్నికల్లో అతని ఓటు బ్యాంకు తో తేలిపోయింది. దాని నుండి చాలా త్వరగానే బయటపడి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గాలికి వదలనని పవన్ చెప్పాడు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి తను ఒక పెద్ద వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు జనసైనికుల్లో ఆశలు రేపారు.

 

అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏపీ మూడు రాజధానులు బిల్లు పై గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత పవన్ అందరి పై విరుచుకుపడతాడు అని అటు రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి రైతులు అంతా ఆశించారు. అయితే అతను మాత్రం గవర్నర్ ఆమోదం పైన మరియు వైసీపీ పైన ఎలాంటి తీవ్ర విమర్శలు చేయకపోగా రాజధానిని తరలించడానికి మరియు దానిపై కార్యాచరణ ను మొదలు పెట్టడానికి ఇది తగిన సమయం కాదని చెప్పి ఊరుకున్నారు. అమరావతి రైతుల గురించి చెప్పకపోతే బాగోదన్నట్లు.. వారికి అన్యాయం జరిగిందని వారంతా కన్నీళ్ళతో రోడ్డు పాలవుతారని అన్నారే తప్ప అమరావతి జేఏసీ నాయకులకు తాము మద్దతు ఇస్తామని…. ఎట్టి పరిస్థితుల్లో దీనిని వ్యతిరేకిస్తున్నామని…. దీనిపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పనే చెప్పలేదు.

అటు ఏపీ బీజేపీ చూస్తేనేమో ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశం అని తాము ఏమీ మాట్లాడలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ప్లేటు తిప్పేసింది. ఇక ఇదే పవన్ ఫాలో అయిపోతున్నాడని తెలుస్తోంది. పవన్ పొత్తు పెట్టుకున్నారే తప్ప వారిలో తమ పార్టీని విలీనం చేయలేదు. ఎన్నికలప్పుడు తప్పించి… అప్పటి వరకు పవన్ తన ఇండివిడ్యువాలిటీ ని మెయింటెన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిజెపి పార్టీ వారు వారికున్న ధన బలం కేంద్ర బలంతో వెళ్లే వ్యూహం వేరుగా ఉంటే…. జన బలం ఉన్న జనసేన ముందుకు వెళ్లే వ్యూహం వేరు గా ఉండాలి కానీ తాము అవతలి వారితో పొత్తులో ఉన్నాం అన్న ఒకే ఒక్క కారణంతో వారు అవలంబించిన వ్యూహాన్ని పవన్ కూడా అవలంభించడం ఏమాత్రం సరిగా లేదని విశ్లేషకుల మాట.

గతంలో బాబు తో ఉన్నప్పుడు కూడా పవన్ ఇదే తప్పు చేశాడు. అయితే చంద్రబాబు తో పోలిస్తే మోడీ ఇంకా డేంజర్. ఒకసారి తగ్గామంటే ఇక మన ఎల్లకాలం మెడను వంచుతూనే ఉంటాడు. కాబట్టి పవన్ బీజేపీతో పొత్తు కన్నా జనాలు దగ్గర మెప్పు గురించి ఎక్కువగా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే బీజేపీకి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకి బీజేపీ అవసరం భవిష్యత్తులో అంతగా రాకపోవచ్చు. అసలు బిజెపితో కలిసి ఉండడం వల్ల ఏమి కోల్పోతున్నామో పవన్ ఆలోచించుకోవాలని కూడా కొందరు హితవు పలుకుతున్నారు. ఈ రాజధాని విషయం అనేది జనసేన ఒక్కటిగా పోరాడి తమ పంతం తనెగ్గించుకోవాల్సిన అంశం. అక్కడే తగ్గిపోతే ఇక ఈసారి పవన్ ఏదైనా విషయంపై నోరు లేపినప్పుడు అంతా లైట్ తీసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి పెద్దన్నల తోలుబొమ్మగా పవన్ మారితే ఇక జనసేన సంగతి అంతే….!

author avatar
arun kanna

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?