25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

Share

PM Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ నందు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. వాస్తవానికి ప్రదాని మోడీ హైదరాబాద్ పర్యటన ఈ నెల 19వ తేదీన జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యుల్ రద్దు అయ్యింది. దీంతో ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేసి షెడ్యుల్ మార్పు చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రారంభోత్సవాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15న వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.

PM Modi

 

తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వివరాలను పీఎంఓ ప్రకటించింది. ఈ ఏడాది జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకోవాలన్న లక్ష్యంలో బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తరచు ప్రదాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు తరచు తెలంగాణలో పర్యటనలు జరుపుతూ పార్టీ రాష్ట్ర యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా బీజేపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తొంది.

రష్యా – గోవా ఫ్లైట్ కు మరో సారి బాంబు బెదిరింపు .. అత్యవసరంగా ఉజ్జెకిస్థాన్ కు మళ్లింపు


Share

Related posts

కంగనకు జర్నలిస్టుల మంట!

Siva Prasad

Samantha: విడాకుల విషయంలో సమంతాకి సపోర్ట్ గా నిలిచిన బిగ్ బాస్ బ్యూటీ..!!

sekhar

‘వరద బాధితులకు ఉదారంగా సాయం’

somaraju sharma