Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో టాలీవుడ్ లో ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఆయితే ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ మళ్ళీ ఆ రేంజ్ హిట్ దక్కలేదు. హాట్ క్యారెక్టర్స్ కూడా చేసింది. ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం, జయ జానకి నాయక లాంటి సినిమాలు చేసినా కూడా ప్రగ్యా జైస్వాల్ కి అనుకున్న సక్సస్ దక్కలేదు. దానికి తోడు టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ రావడం తో వాళ్ళ తాకిడి కూడా తట్టుకోలేక పోయింది.
దాంతో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో సినిమా అవకాశాలు దక్కించుకోవడం లో బాగా వెనకబడింది. ఇక అందరూ ప్రగ్యా జైస్వాల్ ని మర్చిపోయినట్టే అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా జైస్వాల్ విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో ఆకట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో మళ్ళీ మేకర్స్ కంట్లో పడింది. ఏకంగా నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న బిబి3 సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది.
Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ అలాంటి క్యారెక్టర్ లో నటిస్తే టాలీవుడ్ సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్ అవుతుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంతక ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ జయ జానకి నాయక సినిమాలో నటించడంతో మళ్ళీ బీబీ 3 లో ప్రగ్యా కి అవకాశం ఇచ్చాడు బోయపాటి. అంతేకాదు ఏకంగా సింహ సినిమాలో నయనతార ని చూపించినట్టు చాలా పవర్ ఫుల్ రోల్ లో ప్రగ్యా ని చూపించబోతున్నట్టు తాజా సమాచారం. నిజంగా అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ లో ప్రగ్యా నటిస్తే టాలీవుడ్ సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్ అవుతుంది.