24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

సైమా అవార్డ్స్‌లో పుష్ప సినిమా హవా.. అవార్డ్స్ వరించింది వీరినే..

Share

సైమా అవార్డ్స్‌ దక్షిణాది సినిమాలకు ఏటా అవార్డులు ప్రధానం చేసే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 10వ ఎడిషన్ ప్రస్తుతం బెంగళూరులో సెప్టెంబర్ 10-11 తేదీల్లో జరుగుతోంది. తెలుగు, కన్నడ భాషా చిత్రాలకు శనివారం రోజే అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఈ సైమా అవార్డ్స్ 2022లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నాడు. పుష్ప సినిమాలో నటనకు గాను ఈ అవార్డు అతనిని వరించింది. అతని పక్కనే అద్భుతంగా నటించిన జగదీష్ కూడా బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు పొందాడు. పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ పుష్ప: ది రైజ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇంకా ఏయే కేటగిరీలలో ఎవరెవరు అవార్డులను పొందారో ఇప్పుడు తెలుసుకుందాం.

 సైమా అవార్డ్స్‌2022లో పుష్ప సినిమా హవా

Siima 2022 awards

SIIMA 2022: “సైమా 2022” అవార్డులలో సత్తా చాటిన “పుష్ప”..!!

బెస్ట్ ఫిల్మ్: పుష్ప: ది రైజ్ (మైత్రి మూవీ మేకర్స్)

బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప: ది రైజ్)

బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప: ది రైజ్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)

బెస్ట్ లిరిక్స్: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)

అవార్డులు ఎక్కువగా పొందిన జాతిరత్నాలు, ఉప్పెన

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిరియాల (చిట్టి – జాతి రత్నాలు)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)

బెస్ట్ డెబ్యూ యాక్టర్: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్: కృతి శెట్టి (ఉప్పెన)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: బుచ్చి బాబు సన (ఉప్పెన)

ఇతర సినిమాలు, అవార్డులు

Siima Awards

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్: గీతా మాధురి (జై బాలయ్య – అఖండ)

బెస్ట్ యాక్ట్రెస్: పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్: వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)

బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్: సతీష్ వెగ్నేస (నాంది)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)

బెస్ట్ కమెడియన్: సుదర్శన్ (ఏక్ మినీ కథ)


Share

Related posts

Suriya Prabhas: సూర్యతో డిఫరెంట్ సబ్జెక్టు ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న ప్రభాస్ నిర్మాతలు..??

sekhar

సురేందర్ రెడ్డి మీద సైరా ప్రభావం ఇలా పడిందా పాపం ..?

GRK

అనంతపురం పిల్ల… అందాల మోత

Siva Prasad