Raviteja: మాస్ మహారాజ రవితేజ పని ఇక అయిపోయింది అనుకున్న సమయంలో క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు. మూడేళ్ళ తర్వాత కసితో దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ క్రాక్ సినిమా చేసి కరోనా క్రైసెస్‌లో కూడా ఇండస్ట్రీ హిట్ సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ వరుసగా క్రేజీ మూవీస్‌ను లైన్లో పెట్టాడు. అంతేకాదు ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన ఖిలాడి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్గా నటించారు.
పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. సీనియర్ హీరో అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2022, ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కానీ తాజాగా ఓ కొత్త టాక్ వచ్చి మాస్ రాజా అభిమానులకు షాకిచ్చింది. అదే ఖిలాడి సినిమా రిలీజ్ ఇప్పుడు పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అందుకు కారణం షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడమే అంటున్నారు.
Raviteja: గతంలో కూడా ఇలాంటి టాక్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతంలో కూడా ఇలాంటి టాక్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోసారి విదేశాలలో ఓ షెడ్యూల్ పెండింగ్ ఉన్న కారణంగా ఖిలాడి 2022, ఫిబ్రవరి 11న రావడం కష్టమే అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఇదే సినిమా బాలయ్య అఖండ సినిమాతో పోటీకి దింపాలని చిత్రబృంద అనుకున్నారు. ఆమేరకు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బాలయ్య సినిమా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. కానీ రవితేజ సినిమా రిలీజ్ ఇక రెండు నెలలుంది. అంతేకాదు ఈ సినిమాకంటే ముందు రవితేజ నటిస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ రిలీజ్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.