NewsOrbit
న్యూస్

జగన్‌కు బూస్ట్ ఇచ్చే మాటలు చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..! ఎవరా అధికారి, ఏమిటా విషయం…?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి)

ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పుబట్టి విమర్శించడం, పలువురు కోర్టులను ఆశ్రయించడంతో అవి పెండింగ్‌లో పడటం చూస్తునే ఉన్నాం. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీ నేతలు సమర్థించడం, ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాక అనేక అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్గిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడి తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తప్పు అని వ్యాఖ్యానించడం విశేషం.

jayaprakash narayana

ప్రస్తుతంలో ఏపిలో మూడు రాజధానుల అంశం, ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంలో మీటర్ల ఏర్పాటు హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో లోక్‌సత్తా పార్టీ అధినేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

రాజధాని ఎక్కడ పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు జయప్రకాష్ నారాయణ. పరిపాలనా వికేంద్రీకరణకు తాను పూర్తిగా సమర్ధిస్తున్నానని చెప్పారు జయప్రకాష్ నారాయణ. అదే విధంగా విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టడం అనేది మంచి నిర్ణయమని, దీని వల్ల వృధాగా పోతున్న విద్యుత్ ఆదా చేయవచ్చని అన్నారు. ఈ విషయాల్లో సిఎం జగన్మోహనరెడ్డిని అభినందిస్తున్నానన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తప్పన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే హక్కు కోర్టులకు లేదని జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రభుత్వానికి గానీ జడ్జిలకు కాదని ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.

ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన జయప్రకాష్ నారాయణ సీఎం జన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను సమర్ధిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వైసీపీ శ్రేణులకు బూస్ ఇచ్చినట్లు అయ్యింది అంటున్నారు.

author avatar
Special Bureau

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju