Samantha: సమంత విడాకుల తర్వాత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక తమిళ్ సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. త్వరలో బాలీవుడ్ సినిమాలకి కూడా ఓకే చెప్పబోతోంది.
Samantha : మరో డేరింగ్ స్టెప్ వేసిన సమంత..!
ఇక పుష్ప సినిమాతో రష్మిక మందన లతో పాటు సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఐటం సాంగ్తో సమంత ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరించింది. ఊ అంటావా.. మావ ఊ ఊ అంటావా..? అనే పాట అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా సమంత పేరు మరోమారు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. కాగా, ప్రస్తుతం పుష్ప సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆమె మరో డేరింగ్ స్టెప్ వేయబోతుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కొత్తగా ట్రై చేసిన సామ్.. మునుపెన్నడూ కనిపించని విధంగా తొలిసారి గర్భవతి పాత్రలో నటించబోతుదంట.
పాన్ ఇండియా చిత్రంలో డిఫరెంట్ రోల్..
వివరాల్లోకి వెళితే.. సామ్ ప్రస్తుతం ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి హరి, హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో సమంత గర్భవతిగా కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ ప్రెగ్నెంట్ మహిళలకు అనుకోని సమస్యలు ఎదురైతే.. ఆమె వాటిని ఎలా అధిగమించింది అనే నేపథ్యంలో ఈ యశోద చిత్రం తెరకెక్కుతుదంట. విడాకుల తర్వాత ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటించడంతో సామ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha : ఓరి నాయనో .. పుష్ప సినిమాలో పాట కోసం సమంత కి అంత అమౌంట్ ఇచ్చారా..?!
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!