Samantha: సమంతకు, నాగ చైతన్యకు మధ్య విడాకుల తంతు జరిగి నెలలు గడుస్తున్నా వారికి సంబంధించి ఏదోఒక విషయం బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. అసలు విషయంలోకి వెళ్లిపోతే.. ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న చై, సామ్ సడన్‌గా విడాకులు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. గత సంవత్సరం అక్టోబర్ 2న వీరు వారి వ్యక్తిగత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా సామ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
Samantha: సమంతపై నెటిజన్లు ఆగ్రహం.. ఏం చేసిందో తెలిస్తే షాకే!
Samantha: చీర తంతు ఇదే:
పెళ్లి రోజు సామ్ ధరించిన చీర చాలా ప్రత్యేకమైందన్న సంగతి విదితమే. ఫిల్మ్ మేకర్ దగ్గుబాటి రామానాయుడు భార్య ఐనటువంటి దగ్గుబాటి రాజేశ్వరి చీరనే ఆమె ఆరోజు ధరించడం విశేషం. ఎందుకంటే నాగ చైతన్యకు దగ్గుబాటి రాజేశ్వరి అమ్మమ్మ అవుతుంది కనుక. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు గౌరవంగా చై అమ్మమ్మకు సంబంధించిన చీరను సమంత వివాహం రోజు కట్టుకుంది. ఆ శారీ దగ్గుబాటి కుటుంబానికి చెందినది కాబట్టి సామ్ తిరిగిచ్చేసిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Samantha: సమంత టైం బాగుందే.. ఒక్కో సినిమాకి మరీ అన్నికోట్లు తీసుకుంటుందా?
సామ్ అలా నిర్ణయించుకుందట!
చైతన్య నుండి విడిపోయిన తరువాత తనకు సంబంధించిన ఏ వస్తువును కూడా తన వద్ద ఉంచుకోకూడదని సమంత నిర్ణయించుకొని అలా చేసిందని భోగట్టా. ఈ క్రమంలోనే సదరు శారీని కూడా రిటర్న్ చేసిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విషయం ఏదైనప్పటికీ ఓ వర్గం వారు మాత్రం సామ్ ను ఇప్పటికీ రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మనం గమనించవచ్చు. అయినప్పటికీ సామ్ తన కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోవడం మనకు తెలిసినదే.