ఊ అంటావా పాట అసలు ఉద్దేశం ఇదే అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు..!

Share

ప్రముఖ సౌత్ హీరోయిన్ సమంత తన కెరీర్‌లోనే తొలిసారి ఒక ఐటమ్ సాంగ్ చేసింది. పుష్ప సినిమాలో ఆమె నర్తించిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అనే ఐటమ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. సమంత చేసిన ఈ ఐటమ్ సాంగ్ అభిమానులతో పాటు సెలబ్రిటీ లను సైతం బాగా అలరించింది. మగవాళ్ల వంకర బుద్ధిపై ఎగతాళి చేసేలా ఈ పాట లిరిక్స్ ఉండటంతో దీనికి అధిక రెస్పాన్స్ వచ్చింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఈ ఐటమ్ సాంగ్ చేసింది. దాంతో నాగచైతన్య బుద్ధి వంకర బుద్ధి అన్నట్టు ఈమె ఆడి, పాడిందని నెటిజన్లు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు తర్వాత నటించిన సాంగ్ కాబట్టి తన పర్సనల్ లైఫ్ ని లింక్ చేస్తూ చాలా కామెంట్స్ వచ్చాయి.

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అంటూ కరణ్ జోహార్ షో లో సమంత సంచలన కామెంట్..!!

కాఫీ విత్ కరణ్ షోలో సందడి

సమంత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ప్రముఖ హిందీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్ ‘షోలో పాల్గొంది. హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో చిందులేసింది. ఈ ముద్దుగుమ్మ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సమంత, అక్షయ్ కుమార్ ఈ షో చాలా విషయాలు గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా “ఊ అంటావా” పాటలో సామ్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ బాగున్నాయ్ అని కరణ్ మెచ్చుకున్నాడు. ఆ పాట చేయటానికి కారణమేంటని అతను సామ్‌ని ప్రశ్నించగా.. ఆ సాంగ్ ట్యూన్ తనకి నచ్చిందని అందుకే చేశానని చెప్పింది. అది మగవారి చూపులపై సెటైర్‌ వేసేలా ఉండటం మరో కారణమని అన్నది. మగవారి బుద్ధి గురించి తెలిపే ఈ ఐటమ్ సాంగ్‌లో నటించడం వల్ల విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది.

వామ్మో, వారికి మిడిల్ ఫింగర్ అంట

“నిజానికి ఈ పాట మగవారి చూపులపై వస్తుంది కాబట్టి ట్రోలింగ్ రావటం కామన్. కానీ నా లాంటి పెద్ద స్టార్ కాకపోతే ఆ చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరు?” అని సమంత చెప్పుకొచ్చింది. ఎవరేమనుకున్నా సరే నిన్ను ట్రోల్ చేసేవారికి నీ మిడిల్ ఫింగర్ చూపిస్తావా అని కూడా కరణ్ సమంతాను ప్రశ్నించాడు. అందుకు ఆమె అంగీకారంగా తలుపు ఊపింది. కాఫీ విత్ కరణ్ షోలో సామ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ మీడియా రాసిన ఆర్టికల్‌ను సామ్ ట్విట్టర్‌లో షేర్ చేయడం విస్తుగొలుపుతోంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

17 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

26 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago