NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం పర్యటనలో అరుపులు తప్ప మెరుపులు లేవు!బాలినేనికీ తప్పని కుదుపులు!

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటన సాదా సీదాగా,చప్పగా ముగిసింది.వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధుల విడుదల, మహిళా సాధికారత సదస్సు పేరుతో నిర్వహించిన ఈ భారీ కార్యక్రమానికి కోట్ల రూపాయల ఖర్చు అవడం తప్ప ప్రకాశం జిల్లాకు గానీ,ప్రజానీకానికి గానీ సీఎం పర్యటన వల్ల ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు.అన్నిటికీ మించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి కూడా ఆశాభంగం తప్పలేదు!

వ్యూహాత్మకంగానే సీఎం రాక!

ఈనెల పదకొండో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వవస్థీకరించిన సందర్భంలో ఆయన సమీప బంధువు ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డికి రెండోసారి బెర్తు లభించలేదు.పైగా జిల్లాలోనే ఉన్న మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కు బెర్త్ దక్కింది .దీంతో వాసు అలక పాన్పు ఎక్కారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు బాలినేని వాసు ను బుజ్జగించి సీఎం దగ్గరకు తీసుకెళ్లారు.అక్కడ ఏం జరిగిందో గానీ బాలినేని వాసు బాధగానే మెత్తబడ్డారు.అదే సమయంలో సీఎం తాను ఇరవై రెండు న ఒంగోలు వస్తున్నట్లు వాసుకు చెప్పి ఏర్పాట్లు చేయమని పురమాయించారు.

బాలినేని శిబిరంలో పెరిగిన ఆశలు!

దీంతో సీఎం స్వయంగా ఒంగోలు వచ్చి ఏ పరిస్థితుల్లో తిరిగి వాసుకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదో వివరించి ఆయన ఇమేజ్ ప్రజల్లో డ్యామేజ్ కాకుండా చేసేందుకు ఈ పర్యటన పెట్టుకున్నట్లు ఒక కథనం వ్యాప్తిలోకి వచ్చింది అంతేగాకుండా మంత్రి పదవి కోల్పోయిన బాలినేని వాసుకు సభాముఖంగా సీఎం ఏదైనా పెద్ద అధికారిక పదవి ప్రకటిస్తారేమోనని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒంగోలు రాకముందే సీఎం ఆయనను ప్రకాశం,నెల్లూరు బాపట్ల జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్ గా నియమించారు.ఈసారి వాసుకు ఒంగోలు లోని సీఎం వరమాల వేస్తారని ఆయన అభిమానులు ఆశించారు.

పదవి కాదు కదా ప్రాధాన్యతా అంతంతమాత్రమే !

అయితే బాలినేని అభిమానుల అంచనాలు తప్పయ్యాయి.ఒంగోలు వచ్చినప్పటికీ సీఎం జగన్ వాసు ఏ వరమూ ఇవ్వలేదు.పైగా సభ లో కూడా ఆయనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని,వాసు గురించి తన ప్రసంగంలో ఒక్కమాట కూడా సీఎం ప్రస్తావించలేదని ఆయన అభిమానులు గుర్రుగా ఉన్నారు.సిఎం సభలో ప్రసంగించడానికి వెళ్తున్న సమయంలో ఆయనను బాలినేని అనుసరించబోగా జగన్ వారించి మీ సీట్లో మీరు కూర్చోండని అని సైగ చేసినట్లు ఒక మీడియాలో కథనం వచ్చింది.సీఎం సభా వేదికపై కూడా బాలినేని ఉత్సాహంగా కానరాలేదు.మొత్తం మీద బాలినేనికి సీఎం పరంగా ఏ భరోసా లభించక పోవడంతో ఆయన వెళ్ళాక వాసు అభిమానులు చిర్రుబుర్రులాడారు.దీంతో బాలినేని హడావుడిగా విజయవాడ బయల్దేరి వెళ్లిపోయారు.

అదే స్క్రిప్టు..అవే విమర్శలు!

ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రసంగశైలిని ఏ మాత్రం మార్చుకోలేదు.గత కొంతకాలంగా ఎక్కడకు వెళ్లినా టీడీపీని ఎల్లో మీడియాను సీఎం దుయ్యబడుతున్న విషయం తెలిసిందే.అదే ఒంగోలులో కూడా రిపీట్ అయింది.ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడు దుష్టచతుష్టయంగా మారారని,వారితో తాను యుద్ధం చేయాల్సి వస్తోందని సీఎం వాపోయారు.చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఇక ప్రకాశం జిల్లా ప్రజానీకానికి ఆయన కొత్త వరాలేవీ ఇవ్వలేదు. జిల్లా అభివృద్ధికి కూడా ప్రణాళికలేవీ ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే జిల్లాల పునర్విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో తొలిసారిగా జరిగిన సీఎం జగన్ పర్యటన నామమాత్రంగానే సాగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju