Cinema Star Divorce: సెలబ్రిటీలు ప్రేమను వెండితెరపైన ఎంతో అందంగా ఆవిష్కరిస్తుంటారు. మనకు కూడా అలానే ప్రేమించాలని అనిపిస్తుంది. ఎంతో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతూ వుంటారు. మనకి కూడా మన భార్యతో అలానే ఉండాలని అనిపిస్తుంది. కట్ చేస్తే… ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని మనం ఎంతో అందంగా జీవిస్తున్నారు అని అనుకొనే ఆ సో కాల్డ్ సెలబ్రిటీలు చాలా ఈజీగా విడిపోయి రెండు లేదా మూడు పెళ్లిళ్లకు రెడీ అయిపోతూ వుంటారు. దాంతో మనకు షాక్ తగిలినంత పని అవుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే… సినిమా వేరు, జీవితం వేరు అని.
సెలబ్రిటీల జీవితం మనం అనుకున్నంత అందంగా వుంటుందా?
సెలబ్రిటీ లైఫ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వారికి డబ్బు దండిగా ఉంటుంది గాక, వాటితో పాటు కొన్ని వ్యక్తిగత సమస్యలు కూడా ఉంటాయి. ఎంతో దగ్గరినుండి చూస్తే గాని ఈ విషయం అర్ధం కాదు.
బయటకి అందంగా కనిపించే వారి జీవితాల్లో ఎన్నో విషాద ఛాయలు ఉంటాయి. మనలాగే వారికి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. కేవలం డబ్బుతోనే వారు ఆనందంగా వుంటారనుకుంటే పొరపాటే సుమా. ఈ 2021లో చాలా మంది సెలబ్రిటీలు తమ భాగస్వాముల నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసినదే.
ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నవారు వీరే..
ఈ ఏడాది పలువురు అగ్ర హీరోలు హీరోయిన్లు, కొన్ని వ్యక్తిగత కారణాల వలన విడాకులు తీసుకున్నారు. అందులో మొదటగా అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ జంటనే చెప్పుకోవాలి. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతూ అమీర్ ఖాన్ – కిరణ్ రావు విడిపోయారు. ఇక తరువాతి వరుసలో నాగ చైతన్య – సమంత రూత్ ప్రభు వస్తారు. ఎనిమిదేళ్ల ప్రేమాయణం అనంతరం 2017లో వివాహం చేసుకున్నారు. అలాగే ప్రముఖ గాయకుడు అయినటువంటి హనీ సింగ్ – షాలిని ఈ ఏడాది ఆగస్టులో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక ప్రముఖ టెలివిజన్ నటులు కరణ్ మెహ్రా – నిషా రావల్ విడిపోయారనే సంగతి తెలిసినదే.