NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Times Now Survey:  2024 ఎన్నికల్లో తెలంగాణ, ఏపిలో ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు వస్తాయంటే..?

Share

Times Now Survey:  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనీ, తెలంగాణలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కైవశం చేసుకోవడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వే తేల్చింది. వైఎస్ఆర్ సీపీ ఏపిలో 24 నుండి 25 లోక్ సభ స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని టైమ్స్ నౌ స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్ సీపీ విజయం ఏకపక్షమని వెల్లడించింది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉంది కానీ ఫలితం మాత్రం తేడా లేదని తెలిపింది. టీడీపీ  0 – 1 ఎంపీ స్థానమే గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాల అమలునకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 95 శాతంకుపైగా అమలు చేసినందున వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ తగ్గలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో పేద వర్గాలు సంతోషంతో వైసీపీకి బసటగా నిలుస్తున్నారు. ఈ కారణంగానే సీఎం జగన్మోహనరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం ఖాయమనీ, 2019 ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ వెల్లడైన పలు జాతీయ మీడియా సంస్థల సర్వేలు ఏపీలో వైసీపీ హవా ఉన్నట్లుగా తెలియజేస్తున్నాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 9 నుండి 11 సీట్లు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బీజేపీకి 2 నుండి 3 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ పార్టీ 3 నుండి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఇతరులు కూడా ఒక సీటలో విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా టైమ్స్ నౌ వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన సర్వే ఫలితాలను టౌమ్స్ నౌ ఇవేళ విడుదల చేసింది.

Bandaru Satyanarayana: టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు


Share

Related posts

Irregular Periods: నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి తినండి!!

Kumar

Post Office Scheme: సీనియర్ సిటిజెన్స్ కు పోస్టల్ శాఖ బంపర్ స్కీమ్..! అయిదేళ్ల తర్వాత రూ.15 లక్షలు అందుకోవచ్చు ఇలా..!!

bharani jella

ఇప్పుడు తెలంగాణ లో అంద‌రి ఆలోచ‌న ఏంటో తెలుసా?

sridhar