ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి..!!

Share

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జరగబోయే ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రతిపక్షాలు అనేక వ్యూహాలు వేస్తున్నాయి. తిరుపతిలో గెలిచి ప్రభుత్వంపై రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిని టీడీపీ.. రెండు నెలల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nellore: TDP leaders not sure on Panabaka contestఎస్సీ రిజర్వుడు కావడంతో.. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా తిరుపతి పరిధిలో లోక్ సభ ఉప ఎన్నిక కేంద్ర కార్యాలయాన్ని అచ్చం నాయుడు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో.. ఒక ఎన్నిక అభ్యర్థి పనబాక లక్ష్మి హాజరు కాకపోవటం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.

 

ఆమెకు ఉప ఎన్నిక కేంద్ర కార్యాలయం ఓపెనింగ్ ఆహ్వాన పత్రిక పంపించిన గాని ఆమె హాజరు కాకపోవటం పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పనబాక లక్ష్మి వ్యవహార శైలి చూస్తుంటే.. ఎన్నికల ప్రచారానికి కూడా గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీలో అంతర్గతంగా టాక్ వస్తోంది. కారణం చూస్తే ఆమెకు ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం గ్యారంటీ అనే సమాచారం ఉన్నట్లు అందుకే లైట్ తీసుకుంటున్నట్లు తిరుపతి రాజకీయవర్గాలలో వినబడుతున్న టాక్.


Share

Related posts

TTD: సీనియర్ సిటిజన్ లకు టీటీడీ గుడ్ న్యూస్..!!

somaraju sharma

Breaking News: చంపేసి.. ప్రమాదంగా చూపించాలనుకున్నారు.. కానీ..! సినిమాటిక్ క్రైమ్ సీన్ ఇది..!!

Srinivas Manem

వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనలో తేడా గమనించిన జగన్ స్పాట్ ఆదేశాలు…??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar