కరోనా కి భయపడకుండా సినీ తారలంతా అక్కడికే ఎందుకు వెళుతున్నారు ..?

ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.. కానీ ఈ మధ్య కాలంలో అంటే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత లాక్ డౌన్ ఎత్తేసి ప్రయాణాలకు అనుమతి లభించడంతో సెలబ్రిటీలు అంతా విహారయాత్రలకు వెళుతున్నారు. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖులు హాలిడే ని ఎంజాయ్ చేయడానికి ఒకే ఒక్క ప్రదేశానికి క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ఏ ప్రదేశానికి అని ఆలోచిస్తున్నారా.. అదేనండి ఆ అందమైన ప్రదేశం మాల్దీవులు. వీరంతా ప్రశాంతమైన మాల్దీవుల బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Kajal Aggarwal and Gautam Kitchlu are in the lap of luxury, share pics of their underwater room from Maldives honeymoon - bollywood - Hindustan Times

ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ తన భర్త అయినా గౌతం కిచ్లు తో కలిసి హనీమూన్ కి అక్కడికే వెల్లడింది. అలాగే అక్కినేని నాగచైతన్య- సమంత జంట కూడా ఈ బీచ్‌లో సందడి చేసింది. వీరే కాదూ మెహ్రీన్ తన ఫ్యామిలీతో, తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో, ఇంకా షాహిద్ కపూర్ – మీరా రాజ్ పుత్.. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్.. బిపాస బసు- కరణ్ సింగ్ గ్రోవర్.. జహీర్- సాగరిక.. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, వేదిక, ప్రణీత, నేహా ధూపియా ఇలా సినీ తారలంతా మాల్దీవులకే వెళ్ళి వస్తున్నారు.

Samantha Akkineni Maldives vacation photos

ఇలా సినీ ప్రముఖులను అందరిని విశేషంగా ఆకర్షిస్తున్న మాల్దీవులు ఈ ప్రపంచంలో ఒక్కటే ఉన్నాయా అనే డౌట్ రాక తప్పదు. అయితే దీని వెనుక వేరే రహస్యం ఉందంటున్నారు. ఇక్కడి ప్రభుత్వం మాల్దీవులకు వచ్చే సెలబ్రిటీలకు ఉచితంగానే అరేంజ్ మెంట్స్ చేయడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా కారణంగా పూర్తిగా డల్ అయినా మాల్దీవుల టూరిజ పర్యాటక రంగాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఇలా చేస్తుందని కూడా టాక్.

ఇందు కోసం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలకు డిస్కౌంట్స్ ఇవ్వడంతో పాటు కొందరికి ఫ్రీ గా కూడా సదుపాయాలు కల్పిస్తున్నారట. దీంతో వీరు ఇక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల మాల్దీవుల టూరిజం మళ్ళీ పుంజుకుంటోందని అక్కడి టూరిజం వారి ఆలోచనట. వీరి ఆలోచన ఎలా ఉన్నా మన సెలబ్రిటీలు అంతా కరోనాను లెక్కచేయకుండా అక్కడికే ఎందుకు వెళ్లుతున్నారని ఆలోచించి బుర్రలు వేడి ఎక్కించుకుంటున్న అభిమానులకు ఇదే అసలు సీక్రెట్ అని రివీలైంది.