NewsOrbit
న్యూస్

ఈ టెర్మ్ లోనే ‘అధ్యక్షా’ ఆనాలన్న కమలనాథుల కల సాకారమయ్యేనా?

కనీసం అరడజను మంది టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తెచ్చేసుకుని ప్రస్తుత అసెంబ్లీ లోనే ప్రాతినిధ్యం సంపాదించుకోవడానికి కమల నాధులు తెరవెనుక తీవ్రంగా కృషి చేస్తున్నారట!

Will bjp  dream of becoming 'President' come true in this term itself?
Will bjp dream of becoming ‘President’ come true in this term itself?

ఏపీ పార్టీ చీఫ్ సోము వీర్రాజు ఇదే పనిలో ఉన్నారని సమాచారం.విభజిత ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 2019 ఎన్నికలు చుక్కలు చూపించాయి. 0.84 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీ కి వచ్చాయి. 2014 లో రెండు లోక్సభ స్థానాలను గెలుచుకున్న బిజెపికి ఈసారి మొండి చెయ్యే ఎదురైంది .అయినా ఆశ చావడంలేదు. మామూలుగా అయితే 2024 ఎన్నికల వరకు బిజెపి ఆగాల్సిందే .ఆ ఎన్నికల్లోనైనా ఎవరైనా గెలిస్తేనే బిజెపి మోజు తీరేది.కానీ 2024 వరకూ బిజెపి వేచి ఉండలేకపోతోందిట. ఇంకా నాలుగేళ్ళ వరకూ అధికార విరహాన్ని ఓపలేనని అంటోంది. అర్జంటుగా ఈ అసెంబ్లీలోనే కమలం కండువాలు కళకళలాడుతూ కనిపించాలిట.మరి నెలలు నిండకముందే డెలివరీ ఎలా అవుతుంది?ఇప్పటికిప్పుడు బిజెపికి ఎమ్మెల్యేలు ఎలా పుట్టుకొస్తారు?అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Will bjp  dream of becoming 'President' come true in this term itself?
Will bjp dream of becoming President come true in this term itself

కానీ అది అలా అలోచించేవారి వెర్రితనమే అవుతుందేమో?ఇపుడున్నది మోడీ, అమిత్ షా లాంటి గండరగండల నాయకత్వంలోని కాషాయదళం. అందువల్ల అర్జంటుగా బీజేపీకి ఏపీలో ఎమ్మెల్యేలను పుట్టించేయగలరు కూడా!ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ టార్గెట్ టిడిపి అని చెప్పేశారు.ఈ ప్రకటన లోనే బిజెపి కి ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా పుట్టుకొస్తారో సమాధానం ఉంది.కనీసం అరడజన్ మంది టీడీపీ ఎమ్మెల్యేలను అర్జంటుగా బీజేపీలోకి జంప్ చేయించడానికి ఏపీ బీజేపీ ఆరాటపడుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. వైసీపీలో డోర్లు మూసేసిన ఉత్తరాంధ్రా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తెచ్చేయాలని తెగ తాపత్రయపడుతోంది. వీరు వస్తే ఏపీ అసెంబ్లీలో ఇప్పటికిపుడే బీజేపీ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఇది తాత్కాలిక విజయమే అవుతుంది.ఎందుకంటే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరాక బీజేపీ బలం రాజ్యసభ లో పెరిగిందేమో కానీ గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉంది.

ఇక మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి వారిని చేర్చుకున్నా ఎన్టీయార్ ఓటు బ్యాంకు ఇటు రాలేదు, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ప్రెసిడెంట్ గా చేసినా కాంగ్రెస్ నుంచి ఒక్క శాతం ఓటు కూడా ఇటు షిఫ్ట్ కాలేదు. ఆయన సామాజికవర్గం కూడా కన్నెత్తి చూడలేదు. ఇలా ఫిరాయింపులతో ఇంపూ సొంపూ పార్టీకి రాదని అనేక రుజువులు ఉన్నాయి. అయినా కూడా బీజేపీ ఇంకా పాత మోడల్ లోనే వెళ్తోంది.అరువు తెచ్చుకున్న వారితో అసలు సిసలైన రాజకీయం చేయలేమని బీజేపీ నేతలకు ఎప్పుడు అర్థమవుతుందో !

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju