వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభలో ఈ రోజు అరుదైన అవకాశం లభించింది. ఇటీవలే ఆయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ కు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సభను నడిపించే అవకాశం లభించింది. రాజ్యసభ ఫ్యానల్ వైస్ చైర్మన్ హోదాలో గురువారం తొలి సారిగా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చుని సభా వ్యవహారాలను సాయిరెడ్డి నడిపించారు. రాజ్యసభ లో చైర్మన్, వైస్ చైర్మన్ అందుబాటులో లేని సమయాల్లో వైస్ చైర్మన్ ప్యానల్ లో ఉన్న ఎవరో ఒకరు సభను నడిపిస్తుంటారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవలే రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ ను రీషఫిల్ చేశారు. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డికి ప్యానల్ లో చోటు లభించింది. విజయసాయిరెడ్డితో సహా మరో ఆరుగురికి వైస్ చైర్మన్ ప్యానల్ లో తీసుకున్నారు. ఇక లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు పలు సందర్భాల్లో మిథున్ రెడ్డి సభను నడిపించారు. రాజ్యసభలో చైర్మన్ హోదాలో విజయసాయిరెడ్డి సభ నడపడంపై ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…