NewsOrbit
రాజ‌కీయాలు

సరిగ్గా ఏడాది తర్వాత జగన్ కేబినెట్లో ఫస్ట్ వికెట్ డౌన్ ?

తన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ సహచరుల పనితీరును ముఖ్యమంత్రి జగన్ అధ్యయనం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన త‌న మంత్రివ‌ర్గంలోని మంత్రుల్లో టాప్ టెన్ మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్నారు.

అదే సమయంలో తనకు భారంగా తయారైన మంత్రుల జాబితాని కూడా జగన్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటు పాల‌న ప‌రంగా.. అటు వారి వ్యవ‌హార శైలి ప‌రంగా.. అధికారుల‌తో చేస్తున్న స‌మీక్షల‌ను సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని, పాల‌న‌ను ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తున్నార‌నే కోణంలోనూ జగన్ స్టడీ చేసి ఈ రెండు జాబితాలకు రూపకల్పన చేస్తున్నారని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది సారించారు.టాప్ టెన్ లో నిలిచే మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో కూడా కొనసాగించే అవకాశం ఉంది.

వారి విషయం పక్కనబెడితే ఉద్వాసన పలికే మంత్రుల జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి ఉన్నాడని బయటకు పొక్కింది.ఎలాగూ శాసనమండలి రద్దయ్యే నేపథ్యంలో ప్రస్తుత మంత్రులు మోపిదేవి వెంకటరమణ సుభాష్ చంద్రబోస్ లను జగన్ రాజ్యసభకు పంపడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది.ఇదే సమయంలో పనితీరు సరిగ్గా లేని వివాదాస్పదులయిన మరికొందరు మంత్రులను కూడా జగన్ తప్పించే అవకాశం ఉందంటున్నారు.ఈ సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రిపై వేటుపడే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల భోగట్టా ఈ నేప‌థ్యంలో మంత్రులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన మంత్రి ఒక‌రు ఇప్పుడు అల్లాడిపోతున్నారు. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ ద‌గ్గర ఉన్న టాప్ టెన్ మంత్రుల జాబితాలో ఆయ‌న పేరు లేకపోవడమే కాకుండా ఉద్వాసన గురయ్యే జాబితాలో మొదటి పేరుగా ఉందన్న సమాచారం ఆయనకు అందడమే అంటున్నారు.ఆయ‌న చాలా సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన‌ప్పటికీ.. పార్టీకి, ప్రభుత్వానికి ఉప‌యోగ‌ప‌డేలా కార్యక్రమాలు నిర్వహించ‌డం లేద‌నే విమ‌ర్శలు గ‌త కొంత‌కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.ఆ మంత్రి వ్యవహార శైలిపైనా నేరుగా జగన్ కి అనేక ఫిర్యాదులు అందాయి అంటున్నారు.

త‌న‌కు సంబంధం లేని మంత్రుల శాఖ‌ల్లో ఆయ‌న వేలు పెడుతున్నార‌ని చాలామంది జగనుకి చెప్పుకున్నారు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న వ్యవ‌హార శైలిపై సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శలు చేస్తున్నార‌ని జ‌గ‌న్ కు ఫిర్యాదులు అందాయి. ఇక జ‌గ‌న్ స‌ద‌రు మంత్రి సామాజిక వ‌ర్గానికే చెందిన మ‌రో ఎమ్మెల్యేకు భవిష్యత్తులో జరిగే విస్తరణలో మంత్రి ప‌ద‌వి హామీ ఇచ్చి ఉండ‌డం వంటి కారణాల వల్ల ప్రస్తుత మంత్రికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు .జగన్ మంత్రుల్లో పడే ఫస్ట్ వికెట్ కూడా ఈ మంత్రిదే అని సర్వత్రా వినిపిస్తున్న టాక్.


Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!