NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Botsa Joining in BJP: పిచ్చి చానెళ్లు.. వెర్రి వార్తలు..! బొత్స బీజేపీలోకి అంట..!? నిజాలివే..!!

Botsa Joining in BJP: Here is Internal Facts

Botsa Joining in BJP: మీకు తెలుసా..!? మంత్రి బొత్స సత్యన్నారాయణ బీజేపీలోకి వెళ్తున్నారట..! రెండు రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసి మంతనాలు జరుపుతున్నారట. పెద్దలతో వరుస భేటీలు వేస్తున్నారట..!? నమ్మండి బాసూ… నమ్మకం లేకపోతే కొన్ని తెలుగు మీడియా చానెళ్లు చూడండి. వైసిపిపై విషం కక్కే ఛానెళ్లలోనిన్న, మొన్న హైలైట్ అవుతున్న వార్త ఇదే.. తల, తోక… అర్ధం, పర్ధం లేకుండా రాసేయడం, చెప్పేయడం, చూపించేయడం ఈ మధ్య తెలుగు చానెళ్లకు బాగా అలవాటైపోయింది. మంత్రిగా మాంచి హోదాలో ఉంటూ (స్వేచ్చ ఉన్నా లేకపోయినా) అప్పుడప్పుడూ మీడియా ముందు మెరిపిస్తున్న బొత్స… చావు బతుకుల మధ్య ఉంటూ… ఓట్లు, సీట్లు కోసం తడుముకుంటున్న బీజేపీలోకి వెళ్తారంటే నమ్మశక్యమేనా..!? ఆ మాత్రం ఆలోచించే పని లేదా..!?

Botsa Joining in BJP: Here is Internal Facts
Botsa Joining in BJP: Here is Internal Facts

Botsa Joining in BJP: బీజేపీలోకి వెళ్లరు… కానీ..!?

మంత్రి బొత్స కానీ.. ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు కానీ బీజేపీలోకి ఎందుకు వెళ్తారు..!? బీజేపీ ఏపీలో ప్రజలకు దూరమైనా పార్టీ. సో.., ప్రజలకు దూరమవ్వాలనుకుంటున్న నాయకులు మాత్రమే ఆ పార్టీలోకి వెళ్తారు. అంటే ఇక ప్రజాక్షేత్రంలో పోటీ చేయకుండా… ఏ నామినేటెడ్ పదవితోనో జీవితం నెట్టేద్దామన్న రాజకీయ నేతలు మాత్రమే… లేదా కార్పొరేట్ వ్యాపారాలు నడిపి కేసులలో చిక్కుకోక నాయకుల్లో బీజేపీలోకి వెళ్తారు తప్ప… ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన గెలవాలనుకుంటున్న నేతలు ఎవ్వరూ ఏపీలో బీజేపీలో చేరారు అనే విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 2024 ఎన్నికల్లో బీజేపీ వైసిపి తో కానీ.., టీడీపీతో కానీ పొత్తు పెట్టుకుంటే.., సీటు కేటాయింపు కోసం మాత్రమే వెళ్తారు.. అప్పటి వరకు కాస్త పేరున్న ప్రజాసంబంధాల నాయకులు బీజేపీలో చేరిక అంటే పచ్చి అబద్ధమే…! కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. బొత్స విషయంలో ఆ పుకారు ఎందుకొచ్చింది..!? బొత్స ఒకవేళ పార్టీ మారితే ఎటు వెళ్తారు..!? అనేది చుద్ద్దాం..!

Botsa Joining in BJP: Here is Internal Facts
Botsa Joining in BJP: Here is Internal Facts

ప్రైవేట్ టూరు.. కాంగ్రెస్ కి అవకాశం..!?

బొత్సది ఇది పూర్తిగా ప్రైవేటు టూరు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి రెండు రోజులు ఉన్నారు. అక్కడ రెండు రోజులు ఉండేసరికి ఏదో జరిగిపోతుంది..!? బీజేపీలో చేరిపోతున్నారు అనే పుకారు వచ్చేసింది. ఆ వర్గం మీడియాకు అదే వాసన వచ్చినట్టుంది. కాకపోతే ఒకవేళ బొత్స వైసిపిలో కంఫర్ట్ గా లేకపోతే, పార్టీ మారాలి అనుకుంటే కాంగ్రెస్ కె వెళ్లే అవకాశాలున్నాయి. బొత్స కానీ,, ధర్మాన కానీ.., ఆనం కానీ.. ఇలా వైసిపిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్లకు కాంగ్రెస్ పై ఇంకా మనసు పోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో.. కాంగ్రెస్ కోమాలోకి వెళ్ళిపోయినా పరిస్థితుల్లో మాత్రమే వైసిపిలోకి వచ్చారు. అందుకే ఈ నేతలు ఎవ్వరైనా వెళ్ళాలి అనుకుంటే కాంగ్రెస్ కి వెళ్తారు. ఆ పార్టీని లేపుతారు. అంతే తప్ప ఏపీకి అన్నివిధాలా ద్రోహం చేస్తూ… డ్రామాలాడుతున్న బీజేపీలోకి వెళ్లే అవకాశాలే లేవు అనేది రాజకీయ విశ్లేషకుల మాట..!

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju