NewsOrbit
రాజ‌కీయాలు

ముగ్గురు మంత్రుల కొట్లాట..! సీఎంకి కొత్త కష్టాలు..!!

cm under pressure with three ministers

తెలంగాణలో కొత్తగా పదవుల పందేరం మొదలైంది. ఇదంతా.. కేసీఆర్ ఇలాకాలో ఏ మంత్రి పదవి కోసమో అనుకునేరు. జీహెచ్ఎంసీలో ‘మేయర్’ పదవి కోసం. ఇందుకోసం పైరవీలు మొదలయ్యాయి. జనరల్ కేటగిరీ కావడంతో మేయర్ పీఠం ముగ్గురు మంత్రుల మధ్య చిచ్చు పెడుతోంది. అగ్ర నాయకత్వానికి సమస్యలు తెచ్చిపెడుతోంది. ముగ్గరు మంత్రులూ టీఆర్ఎస్ ప్రముఖులే. ప్రస్తుతం ముగ్గురికీ విడివిడిగా ఉన్న లక్ష్యం తమ ‘కోడలు’ని మేయర్ ను చేయాలనే..! ఇందులో భాగంగా ఒకరు బాస్ నుంచి వస్తుంటే మరొకరు చిన బాస్ నుంచి వస్తున్నారు. ఆ ముగ్గురు అమాత్యులే.. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి. మొత్తంగా ఈ వ్యవహారం జీఎచ్ఎంసీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది.

cm under pressure with three ministers
cm under pressure with three ministers

తలసాని శ్రీనివాస్ యాదవ్..

టీఆర్ఎస్ లో ప్రముఖ నాయకుడిగానే కాదు.. రెండో దఫా కూడా మంత్రిగా ఉన్న తలసానికి పార్టీలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కుమారుడు తలసాని సాయికిరణ్ 2019 ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సాయి కిరణ్ భార్యను కార్పొరేటర్ గా నిలబెట్టి, గెలిపించి.. కోడలని మేయర్ ను చేయాలనేది శ్రీనివాస్ యాదవ్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకు కేటీఆర్ వైపు నుంచి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

సీహెచ్ మల్లారెడ్డి..

గతంలో టీడీపీ తరపున అతిపెద్ద నియోజకవర్గమైన మల్కజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచారు. తదనంతర పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019లో తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన కుమారుడు ధర్మారెడ్డి భార్యను మేయర్ ను చేయాలనేది ప్లాన్. ఇందుకు కార్పొరేటర్ గా నిలబెడుతున్నారు. ఈయన ఏకంగా సీఎం కేసీఆర్ నుంచి పావులు కదుపుతున్నారు.

సబితా ఇంద్రారెడ్డి..

మహేశ్వరం ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఆమె కుమారుడు గతంలో ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తన కోడలిని రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసి గెలిపించి మేయర్ ను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. వీరందరి ప్రయత్నాలు ఏమేరకు సఫలమవుతాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

 

 

 

 

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !