NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నానికి గట్టి షాక్..! గుడివాడ అడ్డాలో భారీగా పేకాట – పోలీసుల దాడులు..!

“పోలీసులు అలా కనిపిస్తారు కానీ… సైలెంట్ గా చేయాల్సిన పని చేస్తారు. అధికార పార్టీ వాళ్ళు అయినా.., బయటి వాళ్ళు అయినా పాపానికి ఒడికడితే ఊరుకునేది లేదు. అందుకే పవన్ ఒక ఆరోపణ చేసారు. దీనిలో వాస్తవం ఎంతో తేలాల్సిందే అని ప్రభుత్వం- పోలీసులు ఒక నిఘా పెట్టారు. కొడాలి మనుషులు దొరికారు. ఇది కూడా నాన్ – లోకల్ పోలీసులు చేసిన ప్రత్యేక ఆపరేషన్” దీని పూర్తి వివరాలు “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది..!

గుడివాడ నియోజకవర్గం పేకాటకి అడ్డాగా మారింది అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసారు. దీని నుండి పెద్దోళ్ళకు వాటాలు ఉన్నాయి అంటూ కొడాలి నానిపైకి బురద వేశారు. దాన్ని కొడాలి నాని తుడిచేసుకున్నారు. టీడీపీ హయాంలోనే భారీగా పేకాట జరిగేది, ఇప్పుడు లేదు అంటూ ఆ బురదని టీడీపీపైకి, పవన్ పైకి విసిరారు. దీన్ని మొత్తం గమనించిన పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక నిఘా పెట్టారు. కొడాలి నాని లేదు, ఎవరూ లేదు… పేకాట జరిగితే పట్టుకోవాల్సిందే అంటూ గట్టి ఆదేశాలిచ్చారు. అందుకు గుడివాడ పోలీసులు వెనకడుగు వేశారు. తరచూ చూడడం ఏమి లేదు, ఏమి లేదు.. అసలు పేకాట లేదు అంటూ ఉన్నతాధికారులకు చెప్పడంతో వారు చేతులు దులుపుకున్నారు. కానీ ఉన్నతాధికారుల దగ్గర పక్కాగా సమాచారం ఉంది. అందుకే..!

లోపల పేకాట బయట పోలీసులు

ఏలూరు పోలీసులతో ప్రత్యేక నిఘా..!!

గుడివాడ పోలీసుల వల్ల కాలేదు. అందుకే ఏలూరు పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. ఏలూరు డీఐజీ ప్రత్యేక ఆదేశాలతో 30 మంది పోలీసులతో ఒక ప్రత్యేక బృందం గుడివాడ పరిసరాల్లో నిఘా ఉంచింది. దీంతో గుట్టు రట్టయింది. పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో పోలీసులు నిన్న రాత్రి దాడులు చేశారు. గుడివాడ డిఎస్పీ ఆఫీస్ కి 8 కిలోమీటర్ల దూరంలోనే కొడాలి నాని కజిన్ కి చెందిన ఒక అడ్డాలో వారు అనుచరులు నిర్వహిస్తున్న ఒక పేకాట అడ్డా బయటకు వచ్చింది. 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pekata in Gudivada Area పేకాట జరుగుతున్నది ఇక్కడే

41 వాహనాలుతో భారీగా..!!

ఇక్కడ పేకాట ఎంతగా జరుగుతుంది అంటే… పోలీసుల దాడుల్లో 41 వాహనాలు దొరికాయి. వాటిలో 28 కార్లు, 13 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. నగదు లెక్కించే యంత్రాలు 2 దొరికాయి. వీటితో పాటూ రూ. 55 లక్షలు భారీగా నగదు కూడా పోలీసులకు దొరికింది. పారిపోయిన వాళ్ళు పారిపోగా 32 మంది పోలీసులకు చిక్కారు. ఇది మొత్తం కొడాలి నాని ప్రధాన అనుచరులు నిర్వహిస్తున్నారు అని పోలీసులు నిర్ధారించారు. సో.. దీంతో పవన్ ఆరోపణలు నిజమని తేలిపోయింది. గుడివాడ పోలీసులు చేతులెత్తేశారు. ఏలూరు పోలీసులు పని కానిచ్చారు. మొత్తానికి ఈ వ్యవహారంతో కొడాలి నాని రాజకీయంగా బుక్ అయినట్టే..!!

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju