NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దెబ్బ అదుర్స్ కదూ , జాతీయస్థాయిలో రాజకీయ సమీకరణలు మారుస్తున్న జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలన విషయంలో అనుభవం లేకపోయినా గాని మొట్టమొదటి సారి ముఖ్యమంత్రిగా రాణిస్తూ నేషనల్ స్థాయిలో అనేక ఘనతలు సాధిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేల లో ప్రజలు మెచ్చే రీతిలో జగన్ పరిపాలన చేస్తున్నట్లు పలు సర్వేలలో కూడా ప్రూవ్ అయ్యింది. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ నేతగా పాలన అందిస్తున్న జగన్ జాతీయ స్థాయిలో ఏ ఒక్కరికి సపోర్ట్ లేదంటూనే చాపకింద నీరులా కీలక అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

Many Andhra districts are peaking, says CM Jaganపూర్తి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ…. మోడీ నాయకత్వంలో దూసుకుపోతూ ఉంది. మరోపక్క ఎన్డీఏ కూటమిలో ఎప్పటి నుండో ఉన్న పార్టీలు మోడీ, అమిత్ షా పెత్తనం చేపట్టిన తర్వాత మెల్ల మెల్లగా జారుకుంటున్నారు. ఈ విధంగా శివసేన ఎన్డీఏ కూటమికి దూరం అయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్డీఏ కూటమి నుండి ఆకలి దళ్ సైడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఎన్డీఏకు జరుగుతున్న డ్యామేజ్ ని పూర్తిగా పుర్చడానికి…. మోడీ తనదైన శైలిలో రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశాడట.

 

ఈ క్రమంలో చాలా వరకు దక్షిణ భారత దేశంలో వైసిపి అధినేత జగన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఈమధ్య ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే దక్షిణ భారత దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్న కానీ వైఎస్ జగన్ కి మాత్రమే అంతర్ రాష్ట్ర మండల స్థాయి సంఘ సభ్యునిగా మోడీ గుర్తించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా మోడీని అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో కొన్ని పార్టీలు వైయస్ జగన్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఆ పార్టీలన్నిటికీ చెక్ పెట్టి రాష్ట్రంలో తనకు ఎదురు లేకుండా కేంద్రంలో తన పరపతి పెరిగే లాగా వైయస్ జగన్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

పూర్తి విషయంలోకి వెళితే ఎన్డీఏ కూటమికి వైయస్ జగన్ దగ్గర అవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్. ఇప్పటికే మోడీ జగన్ తో మాట్లాడినట్లు నేషనల్ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలా సందర్భాలలో మోడీ వైసీపీ ని హెల్ప్ అడిగిన క్రమంలో వైయస్ జగన్ చాలావరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. పైగా వైసీపీ పార్టీ దేశంలో ఎక్కువ ఎంపీలు కలిగిన నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మోడీ అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తుంటే, ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉంటున్న తరుణంలో ఎన్డీఏకు దగ్గరయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ…. ప్రత్యర్థులకు దెబ్బ కొట్టే విధంగా జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మార్చడానికి జగన్ ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఈ విధంగా మోడీ కి దగ్గర అయితే రాష్ట్రంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టడంతో పాటు రాష్ట్రాన్ని ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేసుకోవచ్చని జగన్ లోలోపల అనుకుంటున్నట్లు టాక్ వస్తుంది. ఖచ్చితంగా ఇది అమలైతే జగన్ దెబ్బ అదుర్స్ అని కొంతమంది మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంతమంది దళిత ఓటు బ్యాంక్, మైనార్టీలు వైసిపికి పునాది ఓటు బ్యాంక్ అని, కాబట్టి జగన్ చాలావరకు ఎన్డీఏ వైపు వెళ్లే అవకాశం ఉండదని చెప్పుకొస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల బట్టి జగన్ ఆల్రెడీ ఎన్డీయేలోకి వెళ్ళటానికి మోడీతో మంతనాలు జరిపినట్లు త్వరలోనే ప్రకటన రానున్నట్లు వార్తలు జాతీయస్థాయిలో వైరల్ అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడలి. 

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju