NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చాలా కాలం తరవాత చంద్రబాబు పేరు ఎత్తి మరీ క్లాస్ పీకిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ! 

ఇటీవల కృష్ణా జిల్లాలో వైయస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఓపెనింగ్ సందర్భంగా చంద్రబాబు ని వైయస్ జగన్ ఏకిపారేశారు. కృష్ణా జిల్లా కి చెందిన మంత్రులతోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంకా కొంత మంది వైసీపీ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ జగన్ చాలా కాలం తరువాత డైరెక్ట్ గా చంద్రబాబు పేరు ఎత్తి మరీ క్లాస్ పీకారు. ఈ సందర్భంగా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అమరావతి ప్రాంతానికి చేసింది ఏమీ లేదని ద్వజమెత్తారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాజధాని జిల్లాలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఇతర 30 గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో ఈ స్కీమ్ ఓపెన్ చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.

Chandrababu Naidu Letter To YS Jagan About Narsipatnam Doctorఅధికారంలోకి వచ్చి 14 నెలల్లోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి శంకుస్థాపన చేశామని…. వచ్చే ఫిబ్రవరి కళ్ల దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు వందల తొంభై కోట్ల ప్రాజెక్టు వ్యయం కలిగిన దీనివల్ల 2.7 టీఎంసీల నీటితో 38,627 ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. నిజంగా రాజధానిపై చంద్రబాబుకి ప్రేమ ఉంటే ఇలాంటి ప్రాజెక్టులు ఆయన హయాంలో ఎందుకు మొదలు పెట్టలేదు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల అధికారంలో ఎలాంటి ప్రాజెక్టు కట్టలేదని…. కేవలం గ్రాఫిక్స్ తో ఐదు సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ చెప్పుకొచ్చారు.

కాగా వైయస్ జగన్ డెడ్ లైన్ పెట్టి మరి హామీ ఇవ్వటంతో గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన రైతులు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుండి చంద్రబాబు మరియు టిడిపి పార్టీకి చెందిన నాయకులు అనేక విమర్శలు చేస్తున్నా జగన్ ఎప్పుడూ చంద్రబాబు పేరు నేరుగా  ప్రస్తావించలేదు. కానీ తాజాగా “వైయస్సార్ వేదాద్రి” ప్రాజెక్టు చంద్రబాబుకి ఎక్కువగా అనుకూలంగా ఉండే జిల్లాలో ఓపెన్ చేసిన తరుణంలో ఆయన పై జగన్ చేసిన విమర్శలు రెండు జిల్లాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju