NewsOrbit
రాజ‌కీయాలు

‘సత్తెనపల్లిలో కోడెల టాక్స్’

 

సత్తెనపల్లి: దేశ వ్యాప్తంగా జిఎస్‌టి ఉంటే సత్తెనపల్లిలో కెఎస్‌టి (కోడెల సర్వీస్ టాక్స్) ఉందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు కుటుంబం ఇక్కడ అవినీతి రాజ్యమేలుతోందని జగన్ దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోడెల ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

‘పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతీ సమస్య గుర్తుంది. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజక వర్గాల్లో కోడెల సర్వీస్ టాక్స్ వేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కోడెల ప్రజలకు చేసిందేమీ లేదు’ అని జగన్ విమర్శించారు. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కోడెల స్పీకర్‌ పదవి చేపట్టి ఆ పదవిని భ్రష్టు పట్టించారని జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై కూడా జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు వారం రోజులో గద్దె దిగిపోతారన్న ఆనందం డ్వాక్రా మహిళల కళ్లల్లో కనిపిస్తోందని జగన్ అన్నారు. ఐదేళ్ల బాబు పాలనలో అంతా మోసమే చూశామని జగన్ పేర్కొన్నారు.

పచ్చ పత్రికలు వైసిపి‌పై రోజుకో అబద్ధం ప్రచురించడం, దాన్ని చంద్రబాబు తన ప్రచారంలో వాడుకోవడం నీచమైనదని జగన్ అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో వనరులను దోచుకుంటున్నా ఎల్లో మీడియాకు కనిపించడం లేదని విమర్శించారు. రాష్టాన్ని టిడిపి నేతలు అడ్డగోలుగా దోచేశారని జగన్ ఆరోపించారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. బాబు ఇచ్చే మూడు వేల కోసం ఆశపడొద్దని జగన్ అన్నారు. చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మొద్దని జగన్ సూచించారు.

పార్టీ సమీక్షల పేరుతో మంగళవారం ప్రచార కార్యక్రమానికి విరామం ప్రకటించిన జగన్ ఈ రోజు యధావిధిగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

Leave a Comment