NewsOrbit
రివ్యూలు

`కాంచ‌న 3` రివ్యూ

బ్యానర్స్‌: రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌, లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌
తారాగణం: రాఘవ లారెన్స్‌, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, తరుణ్‌ ఆరోరా, కోవై సరళ, శ్రీమాన్‌, దేవదర్శిని, ఢిల్లీ గణేషన్‌, సూరి, అనుపమ కుమార్‌, తదితరులు
ఎడిటింగ్‌: రూబన్‌
మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి
సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌
కెమెరా: సర్వేష్‌ మురారి, వెట్రి పళని స్వామి
నిర్మాత: రాఘవ, ఠాగూర్‌ మధు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌
వ్యవథి: 163 నిమిషాలు
సెన్సార్‌: యు/ఎ

కొరియోగ్రాఫర్‌గా, నటుడు, నిర్మాతగానే కాదు.. దర్శకుడిగా కూడా రాఘవ లారెన్స్‌ తనదైన స్థానాన్ని క్రియేట్‌ చేసుకున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో హారర్‌ కామెడీ చిత్రాలకే ఎక్కువ ఆదరణ లభించాయి. ఓ రకంగా చెప్పాలంటే హారర్‌ కామెడీ చిత్రాలకు రాఘవ లారెన్స్‌ కేరాఫ్‌ అయ్యాడనే చెప్పాలి. మునితో హారర్‌ కామెడీ చిత్రాలను డైరెక్ట్‌ చేయడం స్టార్ట్‌ చేసిన లారెన్స్‌ విజయవతంగా ఇప్పటికీ ముని సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచన 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ముని సిరీస్‌ వచ్చిన మూడు సినిమాలు సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను మెప్పించడంతో నాలుగో భాగంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా ప్రేక్షకులను సిరీస్‌లో గత చిత్రాల్లాగా ఆకట్టుకుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం…

కథ:
రాఘవ తన తల్లి (కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్‌), వదిన(దేవదర్శిని), అన్న కుమార్తెతోకలిసి సంతోషంగా ఉంటాడు. వరంగల్‌లో రాఘవ తాతయ్య(ఢిల్లీ గణేష్‌) షష్ఠి పూర్తి కారణంగా రాఘవ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళతాడు. వెళ్లే క్రమంలో ఓ చెట్టు క్రింద బోజనాలకు కూర్చుంటారు. పరిస్థితుల దృష్ట్యా చెట్టుకు ఉన్న రెండు మేకులను పీకేస్తారు. తాతయ్య ఊరికి చేరుకున్న లారెన్స్‌ మరదళ్లతో ఆడిపాడుతుంటాడు. రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు, ఏడుపు శబ్దాలు వినపడుతుంటాయి. కుటుంబ సభ్యులందరూ భయపడి ఓ అఘోరాను కలుస్తారు. ఇంటికి వచ్చిన అఘోరా ఏవేవో పూజలు చేసి ఆత్మలు ఇంట్లో నుండి వెళ్లిపోయాయని చెబుతాడు. కానీ పరిస్థిలు ఏ మాత్రం చక్కబడవు. ఇంట్లో ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి. రాఘవ విచిత్రంగా ప్రవరిస్తుంటాడు. కుటుంబ సభ్యులందరూ మళ్లీ అఘోరాను కలుస్తారు. అఘోరా చెప్పిన విషయాలు విని అందరూ షాక్‌ అవుతారు. అసలు కాళి ఎవరు? కాళికి, రాఘవకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆత్మలు ఇంట్లో నుండి వెళ్లిపోయాయా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:
పాత్రధారుల విషయానికి వస్తే.. రాఘవ లారెన్స్‌ ఈ చిత్రంలో రెండు పాత్రలను చక్కగా క్యారీ చేశాడు. ఓ పక్క దెయ్యాలంటే భయపడే రాఘవగా.. మరో పక్క పేదలకు దేవుడైన కాళిగా ఇటు లుక్స్‌ పరంగా.. అటు పెర్ఫామెన్స్‌ పరంగా ఆకట్టుకున్నాడు లారెన్స్‌. ఇక డ్యాన్సుల పరంగా మెప్పించాడు. కాళి పాత్రనే సినిమాకు ప్రధానం. ఈ పాత్రను బేస్‌ చేసుకునే అసలు కథ రన్‌ అవుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో శ్రీమాన్‌, దివ్యదర్శినిలతో చేసే నటన.. హీరోయిన్స్‌, తల్లి, అన్నను, వదినను ఆత్మ చితకబాదడం.. వంటి సన్నివేశాల్లో లారెన్స్‌ మెప్పించాడు. రెండు ఆత్మలు ఒకే శరీరంలో ఉంటే ఎలా ఉంటాయనే దాన్ని లారెన్స్‌ చక్కగా నటనలో చూపించాడు. ఇక ముగ్గురు హీరోయిన్స్‌ వేదిక, ఓవియా, నిక్కీ తంబోలిలు గ్లామర్‌ పరంగా ఉన్నంతలో మెప్పించారు. అలాగే బావ మరదళ్ల మధ్య సరసాలు డోస్‌ మరీ ఎక్కువైంది. కుటుంబ సభ్యుల మధ్యే హీరో హీరోయిన్స్‌ రొమాన్స్‌ చేసుకోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక కోవై సరళ పాత్ర ఎప్పటిలాగానే తనదైన కామెడీతో నవ్వించింది. కామెడీ సన్నివేశాలకు కోవై సరళతో పాటు శ్రీమాన్‌, దేవదర్శిని బలాన్ని చేకూర్చారు. తరుణ్‌ అరోరా, కబీర్‌ సింగ్‌ పాత్రలు పరిధి మేర నటించారు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకత్వంలో లారెన్స్‌ ఇందులో కొత్తగా చేసిదేమీ లేదు. కామెడీ, హారర్‌ సన్నివేశాలు ఆయన గత చిత్రాల్లో ఉన్నట్లుగానే ఉన్నాయి. పాత రివేంజ్‌ ఫార్ములా చిత్రం. ఇక పాటల సంగతి సరేసరి.. కథకు, పాటలకు సంబంధమే లేదు. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం హారర్‌ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. సర్వేష్‌ మురారి, వెట్రి పళని స్వామి కెమెరా వర్క్‌ బావుంది. ఎడిటింగ్‌ పెద్దగా బాలేదు.

చివరగా.. కాంచన 3… రొటీన్‌ కథ.. ఓవర్‌ డోసేజ్‌ ..హారర్‌ కామెడీ సన్నివేశాలు వర్కవుట్‌ అయితే వర్కవుట్‌ అయ్యే అవకాశాలున్నాయి.
రేటింగ్‌: 2.5/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment