NewsOrbit
రివ్యూలు

`మ‌జిలీ` రివ్యూ

ప్రేమ గొప్ప‌దే.. అయితే కుటుంబం అంత కంటే గొప్ప‌ది. మ‌నుషుల మ‌ధ్య ఎమోష‌న్స్‌ను స్వార్ధానికి వాడుకోకూడ‌దు అనే పాయింట్‌తో `నిన్నుకోరి` చిత్రాన్ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు శివ నిర్వాణ‌. మ‌రోసారి అలాంటి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం `మ‌జిలీ`. జీవితంలో ఏదో సాధించాల‌నుకున్న యువ‌కుడు, ప్రేమ‌లో, జీవితంలోనూ ఫెయిల్ అవుతాడు. గ‌త జ్ఞాప‌కాల్లోనే ఉండిపోతాడు. అత‌నికి పెళ్లి అవుతుంది. భార్య వ‌చ్చిన త‌ర్వాత ఆ యువ‌కుడు ఎలా మారుతాడు?  భ‌ర్త‌ను మార్చ‌డానికి భార్య ప‌డ్డ త‌ప‌నేంటి?..ఇలాంటి ఎమోష‌న్స్‌తో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య బంధం గురించి శివ నిర్వాణ ఈ చిత్రంలో చూపించ‌బోతున్నాడ‌ని ట్రైల‌ర్ చూసిన ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి నేప‌థ్య‌మున్న క‌థ‌ల‌తో తెర‌కెక్కిన సినిమాలు ఇది వ‌ర‌కు చాలానే విడుద‌ల‌య్యాయి. మ‌రి డైరెక్ట‌ర్ శివ నిర్వాణ సినిమాను ఎలా డీల్ చేశాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే `ఏమాయ చేసావె`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`, `మ‌నం` సినిమాల్లో జంట‌గా న‌టించి నిజ జీవితంలో కూడా జంట‌గా మారిన హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ స‌మంత .. పెళ్లి త‌ర్వాత క‌లిసి జంట‌గా  న‌టించిన తొలి చిత్రం `మ‌జిలీ`. పెళ్లికి ముందు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న చై, సామ్‌, పెళ్లి త‌ర్వాత న‌టించిన `మ‌జిలీ`తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారా?  టాలీవుడ్‌లో సెకండ్ మూవీ సిండ్రోమ్ సెంటిమెంట్‌ను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ అధిగ‌మించారా?  శివ నిర్వాణ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాల‌నుకున్నాడు? మ‌ంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న చైత‌న్య‌కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించింది? అనే విష‌యాల‌ను తెలుసుకునే  ముందు సినిమా క‌థేంటో తెలుసుకుందాం..
బ్యాన‌ర్‌:  షైన్ స్క్రీన్స్‌
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌, రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌:  సాహి సురేష్‌
కెమెరా: విష్ణు శ‌ర్మ‌
సంగీతం:  గోపీసుంద‌ర్‌
నిర్మాత‌లు:  సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:  శివ నిర్వాణ‌
వ్య‌వ‌థి : 154 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్‌:  యు/ఎ
క‌థ‌:
వైజాగ్‌లోని ఐటిఐ చ‌దివే పూర్ణ‌(అక్కినేని నాగ‌చైత‌న్య‌)కి క్రికెట్ అంటే విప‌రీత‌మైన పిచ్చి. పూర్ణ ఆస‌క్తిని గ‌మ‌నించి అత‌ని తండ్రి జ‌గ‌న్నాథ‌మ్‌(రావు ర‌మేష్‌)..అత‌నికి  ఏడాది పాటు స‌మ‌యం ఇస్తాడు. అయితే క్రికెట్‌లో ఇండియ‌న్ టీంకు సెల‌క్ట్ కావాల‌ని .. లేకుంటే త‌ను చెప్పిన‌న‌ట్లు వినాల‌ని కండీష‌న్ పెడ‌తాడు. తండ్రి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో ఇండియ‌న్ టీంకు సెల‌క్ట్ కావాలంటే రైల్వేస్ టీం త‌ర‌పున బెస్ట్ ప్లేయ‌ర్ కావాలి. కాబ‌ట్టి రైల్వేస్ త‌ర‌పున క్రికెట్‌ ఆడ‌టానికి నిర్ణ‌యించుకుని ఆ టీం కోచ్ శ్రీనివాస్‌(ర‌విప్ర‌కాష్‌) స‌హ‌కారంతో  క్రికెట్‌లో ఇంకా రాటు దేలుతాడు. అదే స‌మ‌యంలో వైజాగ్‌లో ప‌నిచేసే నేవీ ఆఫీస‌ర్ కూతురు అన్షు(దివ్యాంశ కౌశిక్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ అప్ప‌టికే పూర్ణపై వ్య‌క్తిగ‌త ద్వేషం పెంచుకున్న అక్క‌డి లోకల్ యూత్ లీడ‌ర్ భూష‌ణ్‌(సుబ్బరాజ్‌) కార‌ణంగా పూర్ణ‌, అన్షు విడిపోతారు. క‌న‌ప‌డ‌కుండా పోయిన అన్షుని పూర్ణ మ‌ర‌చిపోలేక‌పోతాడు. తాగుడికి బానిసై .. త‌న‌కెంతో ఇష్ట‌మైన క్రికెట్‌ను కూడా వ‌దులుకుంటాడు. అదే స‌మయంలో ఎదురింట్లో ఉండే శ్రావ‌ణి .. పూర్ణ‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే పూర్ణ, అన్షు ధ్యాస‌లోనే ఉంటాడు. శ్రావ‌ణి గురించి ప‌ట్టించుకోడు. త‌న తండ్రితో పాటు … శ్రావ‌ణి తండ్రి ..ఇలా ఎవ‌రు ఎన్ని తిట్టినా పూర్ణ‌ ప‌ట్టించుకోడు. త‌న ధ్యాస‌లో త‌నుంటాడు. చివ‌ర‌కు వీరి జీవితంలో మీరా అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అస‌లు మీరా ఎవ‌రు?  మీరాను పూర్ణ‌, శ్రావ‌ణి ఎందుకు ద‌త్త‌త తీసుకుంటారు?  చివ‌ర‌కు పూర్ణ‌, శ్రావ‌ణిల జీవితం ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్ల‌స్ పాయింట్‌:
– ద‌ర్శ‌క‌త్వం
– క‌థ‌, క‌థ‌నం
– న‌టీన‌టులు
– సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌
– కెమెరా ప‌నిత‌నం
మైన‌స్ పాయింట్స్‌:
– అక్క‌డ‌క్క‌డా సాగ‌దీసిన‌ట్లు ఉండే స‌న్నివేశాలు
– సెకండాఫ్‌లో డ్రామా డోస్ పెరిగ‌న‌ట్టు అనిపించ‌డం
స‌మీక్ష‌:
పెళ్లికి ముందు ప్రేమ‌.. పెళ్లి త‌ర్వాత ప్రేమ అనే అంశాల‌ను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వ‌చ్చినా.. కొన్ని సినిమాలే ఆద‌ర‌ణ పొందాయి. అందుకు కార‌ణం క‌థ‌, క‌థ‌నమే కార‌ణం. ఎమోష‌నల్ సీన్స్‌ను ఎలా హ్యాండిల్ చేశార‌నే దాన్ని బ‌ట్టి ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్  స‌క్సెస్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ చ‌క్క‌గా అర్థం చేసుకున్నాడు. కాబ‌ట్టి స‌న్నివేశాల‌ను హ‌ద్యంగా.. చ‌క్క‌గా మ‌లిచాడు. ప్రేమ‌ను, బాధ‌ను మిక్స్ చేసి వాటికి అనుగుణంగా స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు. సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయి. ఓ ప్రేమ‌క‌థ ఫ‌స్టాఫ్‌లో ఉంటే.. మ‌రో ప్రేమ‌క‌థ సెకండాఫ్‌లో ఉంటుంది. ఈ రెండు ప్రేమ‌క‌థ‌ల‌ను బ్యాలెన్స్ చేస్తూ ఎమోష‌న‌ల్‌గా సినిమాను తెర‌కెక్కించాడు. ఫ‌స్టాఫ్ అంతా యూత్‌ను మెప్పించేలా ఉంటే.. సెకండాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. స‌న్నివేశాలు మ‌న చుట్టూ మ‌నం చూసేలానే అనిపిస్తాయి. అలాగే స‌న్నివేశాల్లో డ్రామా కూడా చ‌క్క‌గా పండింది.  ప్రేయ‌సి కోసం ప్రేమికుడు ప‌డే బాధ ఒక‌వైపు.. భర్త కోసం తాప‌త్ర‌య‌ప‌డే భార్య మ‌రో వైపు.. కొడుకు కోసం బాధ‌ప‌డే తండ్రి .. అలాగే కూతురి కాపురం బావుండాల‌ని  ఆరాట‌ప‌డే తండ్రి .. ఇలా ఓ కుటుంబాన్ని రెఫ‌ర్ చేసే చిత్రంలో సందర్భానుసారం కామెడీ, బ‌రువైన డైలాగులు మిక్స్ చేసి తెర‌కెక్కించారు. నాగ‌చైత‌న్య తొలి హాఫ్‌లోక్రికెట‌ర్ కావాల‌నుకునే యువ‌కుడిగా, ల‌వ‌ర్‌గా మెప్పించాడు. అలాగే సెకండాఫ్‌లో మ‌ధ్య వ‌య‌స్కుడైన భ‌ర్త‌గా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక స‌మంత సినిమాకు ఇరుసులా వ్య‌వ‌హ‌రించింది. సెకండాఫ్ అంతా ఆమెను బేస్ చేసుకునే ర‌న్ అయ్యింది.  ఓర‌కంగా సెకండాఫ్ అంతా స‌మంత‌నే క్యారీ చేసింది. తండ్రులుగా న‌టించిన రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళిలు పాత్ర‌ల‌కు అతికిన‌ట్టు స‌రిపోయారు. దివ్యాంశ కౌశిక్ తొలి చిత్ర‌మే పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది.  గోపీసుంద‌ర్ సంగీతం.. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో నిలిపాయి. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ రిచ్‌గా ఉంది. లొకేష‌న్స్ చాలా నేచుర‌ల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ బావుంది. పాట‌లు , డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
బోట‌మ్ లైన్‌:
మ‌జ‌లీ.. ఎమోష‌న‌ల్ జ‌ర్నీ
రేటింగ్‌: 3/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment