NewsOrbit
రివ్యూలు

రివ్యూ

సినిమా : సీత‌
ఆర్టిస్టులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్, మ‌న్నార చోప్రా, సోనూ సూద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అభిమ‌న్యు సింగ్ తో పాటు ప‌లువురు.
నిర్మాణ సంస్థ : ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ప్రొడ్యూస‌ర్‌: అనిల్ సుంక‌ర‌
కో ప్రొడ్యూస‌ర్స్: అజ‌య్ సుంక‌ర, అభిషేక్ అగ‌ర్వాల్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ కిషోర్ గ‌రికిపాటి
ర‌చ‌న‌: ల‌క్ష్మీ భూపాల్‌
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్
`అల్లుడు శీను`తో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ, త‌న‌దైన స్టైల్లో డ్యాన్సులు, ఫైట్లు చేస్తూ, ప‌క్కా మాస్ హీరోగా ఎలివేట్ కావాల‌ని ప‌లు సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయ‌న న‌టించిన `సీత‌` అందుకు భిన్న‌మైంది. తాజాగా ఆయ‌న త‌న‌లోని న‌ట‌న‌ను చూపించుకోవ‌డానికి చేసిన సినిమా `సీత‌`. ఇంత‌కు ముందు ఎప్పుడూ లేన‌న్ని డైలాగులు ఈ సినిమాలో చెప్పారు. ప‌లు షేడ్స్ ఉన్న కేర‌క్ట‌ర్‌లో ఆయ‌న క‌నిపిస్తారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేసే సినిమా అంటే ప్ర‌తి హీరో ప్ర‌త్యేకంగానే ఫీల‌వుతారు. ఈ `సీత‌` బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో ఎలాంటి సినిమా అవుతుంద‌నేది ఆస‌క్తిక‌రం.

క‌థ‌:
సీత‌(కాజ‌ల్ అగ‌ర్వాల్‌) హోట‌ల్‌ వ్యాపారం చేయాల‌నుకుంటుంది. అందుకోసం హైద‌రాబాద్‌లో నేతాజీన‌గ‌ర్‌లోని పోరంబోకు స్థలాన్ని కొనుక్కుంటుంది. అక్క‌డున్న పేద వారిని త‌రిమేయ‌డానికి ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు గౌడ్‌(సోనూ సూద్‌) స‌హ‌యం కోరుతుంది. సీత అందం చూసి ఆమెపై బ‌స‌వ‌రాజు మోజు ప‌డ‌తాడు. త‌న‌తో స‌హజీవ‌నం చేస్తే స‌హాయం చేస్తాన‌ని అంటాడు. స‌రేన‌ని! ఒప్పుకుని సీత ఒక నెల పాటు బ‌స‌వ‌రాజుతో స‌హ‌జీన‌వం చేస్తాన‌ని ఒప్పుకుంటుంది. బ‌స‌వ‌రాజు స‌హాయం చేసిన త‌ర్వాత సీత అగ్రిమెంట్‌పై సంతకం చేసిన‌ట్లు కాకుండా మోసం చేస్తుంది. దాంతో బ‌స‌వ‌రాజు ఆమెపై క‌క్ష క‌ట్టి ఆమెపై చెక్‌బౌన్స్ కేసు స‌హా ప‌లు కేసుల‌ను బ‌నాయింప చేస్తాడు. దాంతో సీత కు డ‌బ్బులు అవ‌స‌రం అవుతుంది. అయితే తండ్రి చనిపోతూ, 5000 కోట్ల రూపాయ‌ల ఆస్థిని రఘురామ్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌) రాసేస్తాడ‌ని తెలుసుకుంటుంది. డ‌బ్బులన్నింటినీ త‌న పేరుపై రాయించుకుని రామ్‌ని వ‌ద‌లించుకోవాల‌నుకుంటుంది. కానీ ప్ర‌తి సంద‌ర్భంలో సీత‌కు క‌ష్టాలు రావ‌డం, రామ్ ఆమెకు స‌హాయ ప‌డ‌టం జ‌ర‌ర‌తుంటుంది. చివ‌ర‌కు సీత, డ‌బ్బులు కోసం ఏం చేసింది? బ‌స‌వరాజు నుండి సీత‌ను ర‌ఘురామ్ ఎలా కాపాడుకున్నాడు? అనే విషాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:
ద‌ర్శ‌కుడు తేజ హీరోయిన్ సెంట్రిక్ మూవీని తెర‌కెక్కించాల‌నుకున్నాడు.నాలుగైదు పాత్ర‌ల‌ను తీసుకుని వాటిలో సీత అనే పాత్ర‌ను బేస్ చేసుకుని క‌థ‌ను రాసుకున్నాడు. టైటిల్ పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ చాలా బాగా నటించింది. పూర్తిస్థాయి నెగ‌టివ్ ట‌చ్‌లో పాత్ర‌ను కాజ‌ల్ చ‌క్క‌గాపోషించింది. అలాగే తేజ‌, కాజ‌ల్ పాత్ర‌ను చాలా చ‌క్క‌గా మ‌లిచాడు. ఇలాంటి పాత్ర‌ను పోషించ‌డానికి కాజ‌ల్ అంగీక‌రించడ‌మే కాదు.. చ‌క్క‌టి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌, ఇప్ప‌టి వ‌ర‌కు డ్యాన్సులు, ఫైట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఈసారి వైవిధ్య‌మైన పాత్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక విల‌న్‌గా న‌టించిన సోనూసూద్ ఎక్స‌లెంట్‌గా న‌టించాడు. చాలా రోజుల త‌ర్వాత సోనూసూద్ పాత్ర మెప్పించింది. విల‌నే అయినా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే చిత్ర‌మిది. భాగ్యరాజ్‌, బిత్తిరిస‌త్తి, అభిన‌వ్‌, మ‌న్నారా త‌దిత‌రులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. లొకేష‌న్స్ బావున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాలేదు. కెమెరా వ‌ర్క్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఫ‌స్టాఫ్‌లో బాగాఉంద‌నిపించిన ఈ చిత్రం సెకండాఫ్ సాగ‌దీత‌తోబోరింగ్‌గా అనిపిస్తుంది.

బోట‌మ్ లైన్‌: సీత‌.. సాగ‌దీత‌
రేటింగ్‌: 2.25/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment