NewsOrbit
రివ్యూలు

రివ్యూ

సినిమా: ఎన్‌.జి.కె
తారాగ‌ణం:  సూర్య‌, సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్, దేవ‌రాజ్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, బాలా సింగ్‌, ఉమా ప‌ద్మ‌నాభ‌న్ త‌దిత‌రులు
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ :  డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల‌: శ్రీసత్యసాయి ఆర్ట్స్ , కె.కె.రాధామోహన్‌
మ్యూజిక్‌:  యువన్‌ శంకర్‌రాజా
ఛాయాగ్ర‌హ‌ణం: శివకుమార్‌ విజయన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
క‌ళ‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
ద‌ర్శ‌క‌త్వం : శ్రీరాఘవ
శ్రీరాఘ‌వ పేరు చెప్ప‌గానే `7/  జీ బృందావ‌న్ కాల‌నీ`, `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న చాలా సినిమాలు చేసినా ఎందుకో ట‌క్కున స్ఫురించ‌వు. అయినా ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల్లోనే కాదు, సినిమా వ‌ర్గాల్లోనూ క్రేజ్  ఉంది ఆయ‌న‌కు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని న‌టీన‌టులంద‌రూ కోరుకుంటారు. తాజాగా ఆ ఛాన్స్ సూర్య‌కు ద‌క్కింది. తెలుగులో బాగా పేరున్న సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. గ‌త కొన్నాళ్లుగా స‌రైన హిట్ కోసం చూస్తున్నారు సూర్య‌. అటు ద‌ర్శ‌కుడు, ఇటు హీరో కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్న త‌రుణంలో వ‌స్తున్న సినిమా `ఎన్‌.జి.కె.` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా?

క‌థ‌:
నంద‌గోపాల‌కృష్ణ‌ను అలియాస్ గోపాల్ ఎం.టెక్ చ‌దువుకుని,  స‌మాజానికి సేవ చేయాల‌నే ఉద్దేశంతో త‌న‌కు తోచిన విధంగా అంద‌రికీ స‌హాయ‌ప‌డుతుంటాడు. అయితే గోపాల్, త‌న మంచి ప‌నుల కార‌ణంగా త‌మ‌కు అడ్డు వ‌స్తున్నాడ‌నుకున్న ఊరి ఎమ్మెల్యే, అత‌ని మ‌నుషులు గోపాల్‌ని, అత‌ని మ‌నుషుల‌ను చావ‌బాదుతారు. వారి బారి నుండి కాపాడ‌మ‌ని ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌కు  గోపాల్ వెళితే ప్ర‌తిప‌క్షంలోని త‌న పార్టీలోకి చేర‌మంటాడు. ప‌రిస్థితుల దృష్ట్యా గోపాల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడు. అయితే క్ర‌మంగా త‌న‌ని కొట్టించిన ఎమ్యేల్యేకు కుడిభుజంగా ఎదుగుతాడు. అక్క‌డ నుండి అధిష్టానం దృష్టిలో ప‌డ‌తాడు. ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా సాక్ష్యాలు సేక‌రించ‌మ‌ని అధిష్టానం కోర‌డంతో వారికి స‌హాయ‌ప‌డి ముఖ్య‌మంత్రితో గొడ‌వ తెచ్చిపెట్టుకుంటాడు. అధికార ప‌క్షం, త‌న ప‌క్షం వాళ్లు గోపాల్‌పై క‌క్ష క‌డ‌తారు. అప్పుడు వ‌నిత‌(రకుల్ ప్రీత్ సింగ్‌), గోపాల్‌కు అండ‌గా నిల‌బ‌డుతుంది. ఇంత‌కు వ‌నిత ఎవ‌రు?  గోపాల్‌ను అత‌ని పార్టీ వాళ్లే ఎందుకు చంపాల‌నుకుంటారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

విశ్లేష‌ణ‌:

సూర్య సినిమాకు ప్ర‌ధాన బిందువుగా మారాడు. ఓ ర‌కంగా సినిమా అంత‌టినీ త‌నే ముందుండి న‌డిపించాడు. సాధార‌ణంగా శ్రీరాఘ‌వ సినిమాల్లోని పాత్ర‌లు విల‌క్ష‌ణంగా ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. అలాంటి ప్ర‌వ‌ర్త‌న సూర్య స‌హా సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ఇత‌ర పాత్ర‌ల‌న్నింటిలోనూ క‌న‌ప‌డుతుంది. స‌మాజానికి సేవ చేస్తుంటే రాజ‌కీయ నాయ‌కులు, అధికారులు అడ్డుప‌డుతుంటారు. అప్పుడు మాన‌సికంగా బాధ‌ప‌డే యువ‌కుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో `నేర్చుకుంటానండీ..` అంటూ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో సూర్య చేసిన న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు మెప్పిస్తుంది. ఇక సాయిప‌ల్ల‌వి పాత్ర మొగుడితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటుంది. ఇక ర‌కుల్ పాత్ర‌కు సినిమాలో ఇచ్చిన బిల్డ‌ప్‌కు, క‌థలో ఆమె పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త‌కు సంబంధ‌మే ఉండ‌దు. నిర‌ల్‌గ‌ల్ ర‌వి, ఉమా ప‌ద్మ‌నాభ‌న్‌, దేవ‌రాజ్ స‌హా ఇత‌ర పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక సాంకేతికంగా చూస్తే.. శ్రీరాఘ‌వ చెప్పాల‌నుకున్న అంశాన్ని లాగి లాగి చెప్పాడు. సినిమా అంతా తిక‌మ‌క‌గా లింక్ లేకుండా సాగుతుంది. పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ బాలేదు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం, నేప‌థ్య సంగీతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

చివ‌ర‌గా.. నంద‌గోపాల కృష్ణ‌.. నిరుత్సాహ‌ప‌రిచాడు
రేటింగ్‌: 2.25/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment