NewsOrbit
సెటైర్ కార్నర్

ప్రతి ఇంటా నిఘా కెమెరాలు!

Representational Image

(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్య వార్తావిభాగం)

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 23 : కంప్యూటర్లపై నిఘా ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని ప్రతి ఇంట్లోనూ నిఘా కెమెరాలు పెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.  ఆ కెమెరాల కంట్రోల్‌ను పది కేంద్ర సంస్థలకు దఖలు పరుస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. శనివారం అర్ధరాత్రి విడుదలైన ఈ ఉత్తర్వులపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా చేవ్రాలు ఉంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2000 లోని సెక్షన్‌ (Section 69 in The Information Technology Act, 2000) నాలుగో నిబంధన కింద లభించిన అధికారాలను ఉపయోగించి ప్రతి ఇంట్లోని వ్యక్తుల కదలికలపై కేంద్రానికి చెందిన పది భద్రతా, దర్యాప్తు సంస్థలు ఇలా నిఘా పెట్టవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చివరికి టాయిలెట్స్ కు కూడా నిఘా నుంచి మినహాయింపు లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలకు పైగానే అవసరం కాగలదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిఘా కెమెరాలకయ్యే వ్యయాన్ని ప్రత్యేక సెస్ ద్వారా ప్రజల నుంచే రాబట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పని సరి అనీ, దీన్ని వ్యతిరేకించినా, కెమెరాల ఏర్పాటును అడ్డుకున్నా చట్టరీత్యా నేరమనీ ప్రభుత్వం హెచ్చరించింది. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినవారంతా దేశద్రోహులేనని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినా, వ్యతిరేకించినా గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చునని మోదీ ప్రభుత్వం (The subscriber or intermediary or any person who fails to assist the agency referred to in sub-section (3) shall be punished with imprisonment for a term which may extend to seven years and shall also be liable to fine.] చట్టంలోని నిబంధనలను ఉటంకిస్తూ హెచ్చరించింది.

విపక్షాల నిరసన

ఇదిలావుండగా కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. ఇది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని విపక్షాలు మండిపడ్డాయి. ఇప్పటికే ఏ కంప్యూటర్‌ వ్యవస్థలోనైనా జొరబడేందుకు, డీక్రిప్ట్‌ చేసేందుకు కేంద్ర సంస్థలకు వీలు కల్పించి మోదీ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాచిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

ఇప్పుడు మరోసారి కెమెరాల బిగింపు ఉత్తర్వులతో దేశంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణాన్ని సృష్టించారని ఆయన నిరసించారు. అలా దేశంలో ఎమర్జెన్సీ విధించే హక్కు ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. కావలిస్తే దీనిపై చర్చకు మోదీ చరిత్ర చదువుకుని రావాలని ఆయన సవాలు విసిరారు. దీనిపై మిగతా విపక్షాలను కలుపుకుని జంతర్ మంతర్ దగ్గర త్వరలో ఒక్క రోజు నిరశన దీక్ష చేపడతామని రాహుల్ ప్రకటించారు. దీనిపై పార్లమెంటును ఎప్పటిలాగే స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. కనీసం టాయిలెట్స్ కైనా మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా మద్దతు తెలిపారు. తమ ఫ్రంట్ దీనిపై ఉమ్మడిగా ఉద్యమిస్తుందన్నారు.  మరోవైపు దీనికి వ్యతిరేకంగా, స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని అడిగి, ఏదైనా యాగం చేసి, బీజేపీయేతర, కాంగ్రెసేతర విపక్షాలను కూడగడతామని, ఫెడరల్ ఫ్రంట్ వేదిక నుండి దీన్ని గట్టిగా నిరసిస్తామనీ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక విమానంలో ఏడాది పొడవూనా దేశమంతా తిరుగుతానని ఆయన ప్రకటించారు.

కాగా, విపక్షాల ఆందోళన అర్థరహితమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొట్టిపారేశారు. లోగడ గుజరాత్‌లో తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చేశానని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌ల వంటి నిఘా విధానాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం తాలూకు హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దేశం అధోగతి పాలవుతుందన్నారు. ఈ చర్యలన్నీ మోదీ అచ్ఛే దిన్ వాగ్దానంలో భాగమేనన్నారు. దీనిపై కోర్టుకెక్కినా ఏమీ లాభం ఉండబోదన్నారు. సొహ్రాబుద్దీన్ షేక్ కేసులో గంపగుత్తగా 22 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సీబీఐ కోర్టు తాజా తీర్పును చూసైనా విపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని అమిత్ షా హితవు పలికారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఘర్ ఘర్ మోదీ అన్న నినాదానికి ఈ నిర్ణయంతో పూర్తి సార్థకత చేకూరిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుమతించిన పది సంస్థలివే…
సీబీఐ, ఎన్‌ఐఏ, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ,) నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు , డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ),  డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ (జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, అసోం సంబంధించినంత వరకూ), ఢిల్లీ పోలీసు కమిషనర్.

Note : వ్యంగ్యవార్తలు అన్నది ఒక సెటైరికల్ రచనా ప్రక్రియ. ఫేకింగ్ న్యూస్ (faking news) పేరుతో ఇది ఇంగ్లీషులో పాపులర్. వివిధ  ఘటనలు, పరిణామాల తాలూకు డొల్లతనాన్ని ఎండగట్టడమే దీని ఉద్దేశ్యం..ప్రయోజనం. అంతేతప్ప ఇవి నిజం వార్తలు కావు. పాఠకులు గమనించగలరు. 

Related posts

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

sridhar

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar

Dhivya Bharathi Joshful Photos

Gallery Desk

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem

ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

Srinivas Manem

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y

ఆనియన్ ఛాలెంజ్!

Srinivasa Rao Y

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y

Leave a Comment