NewsOrbit

Tag : americans

న్యూస్ రాజ‌కీయాలు

ఇంటర్నేషనల్ :  అమెరికన్ల మనసుల్లో  హీరో అయిపోయిన మనోడు !

siddhu
  అగ్రరాజ్యంలో నల్లజాతి వివక్షపై పోరాటం రోజురోజుకీ విపరీతంగా మారుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని పోలీసులు అతి దారుణంగా గొంతుపై కాలేసి తొక్కి చంపిన ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆ ఆందోళనల తాకిడికి తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్ లోనికి వెళ్ళిపోయాడు. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా ఈ ఉద్యమంలో ఓ ఇండియన్ అమెరికా జాతీయ హీరో అయ్యాడు. అతను చేసిన సహకారం అలాంటిది మరి. రాహుల్ దూబే అనే ఒక భారతీయుడు అమెరికా రాజధాని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు కలిసి విధించిన వేళ మనవడు రాత్రి సమయంలో వందల మంది నల్ల జాతీయులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. పక్క రోజు ఉద్యమం కోసం వారికి సేదతీరేందుకు చోటుని మరియు వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేసి ఆదుకున్నాడు. రాహుల్ 17 ఏళ్లుగా వాషింగ్టన్ డి.సిలో ఉంటున్నాడు. ఆయనకు అల్వారేజ్ ట్రేడింగ్ అనే ఒక వ్యాపార సంస్థ ఉంది. గత కొద్ది రోజులుగా ఉద్యమకారులు జార్జి ఫ్రాయిడ్ కి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగి తీరాలని మరియు తక్షణమే పోలీసులను అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అనేక ఉద్యమాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వం వారిని కట్టడి చేసేందుకు ఉన్న ఫలంగా కర్ఫ్యూ విధించడంతో ఆందోళనకారులు రాత్రివేళలో ఎటువైపు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరొకవైపు పోలీసులు కక్ష కట్టినట్లు వారిని తరుముతూ ఉంటే అటువంటి సమయంలో రాహుల్ దూబే వారికి అండగా నిలిచాడు. వచ్చినవారిని కాదనకుండా ఇంట్లోనే ఏదో ఒక మూల ఆశ్రయం కల్పించాడు. దీంతో ఇప్పుడు నల్లజాతి ఉద్యమకారులు రాహుల్ దూబేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమకు కష్టకాలంలో అండగా నిలచిన రాహుల్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఒక్కసారిగా రాహుల్ దూబే మీడియాకూ ఓ మంచి వార్తగా మారాడు. ఇప్పుడు అమెరికా మీడియాలో రాహుల్ దూబే పేరు మార్మోగిపోతోంది. చాలామంది నల్ల జాతీయులు రాహుల్ దూబే ఈజ్ ఏ హీరో అంటూ అతని ఫోటోని తమ ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకున్నారు....
టాప్ స్టోరీస్

80 మంది అమెరికా ఉగ్రవాదులను చంపేశాం: ఇరాన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇరాక్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా 15 క్షిపణులతో దాడి చేశామని… ఈ దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది.  ఒకవేళ అమెరికా...