అమెజ్ ఫిట్ నుండి త్వరలోనే మరో ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురానుంది. అది ఏదో కాదు ఫిట్ జిటిఎస్ 2 స్మార్ట్ వాచ్. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో అమ్మకాలు చేపట్టిన అమెజ్ ఫిట్ ఈ స్మార్ట్ వాచ్ ను ఈ నెల 21న విడుదల చేయనుంది. యువతకు నచ్చే విధంగా ఈ స్మార్ట్ బ్యాండ్ ను డిజైన్ చేసినట్టు సంస్థ తెలిపింది. అంతేకాదు స్టోరేజ్ చేసుకునే సదుపాయంతో పాటు పలు ఫీచర్లను అందించనుంది. ఆ ఫీచర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ నెలలో విడుదలవుతున్న ఈ ఫిట్ GTS 2 స్మార్ట్‌వాచ్ పూర్తి వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యంతో పాటు స్విమ్మింగ్ చేస్తున్నపుడు కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఆండ్రాయడ్ 5.0 మరియు ఐఓఏస్ 10.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేయనుంది. దీనిని ఉపయోగిస్తున్నప్పుడు మీ హృదయ స్పందనను కూడా ఇది పర్యవేక్షిస్తుంది. అంతేకాదు అసాధారణమైన హృదయ స్పందనలను గమనించినప్పుడు ఈ స్మార్ట్ వాచ్ హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో 90కి పైగా గేమ్స్ సౌకర్యంతోపాటు ౩జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఫోన్ కనెక్షన్‌కు కాల్స్ కోసం ఇంబిల్ట్ స్పీకర్ మరియు మైక్రోఫోన్ కూడా ఇందులో పొందుపరచారు.
దీనిని ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసే సదుపాయం కూడా కల్పించారు. గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, ఎయిర్ ప్రెజర్ సెన్సార్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఫీచర్లను కూడా ఈ వాచ్ కలిగిఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 246 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంబిల్ట్ చేశారు. ఒక్క సారి ఫుల్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ 7 రోజుల వరకు ఉంటుంది. దీని ధర రూ.12,999. ఈ అమాజ్‌ఫిట్ GTS 2 1.65 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. డిసెంబర్ 21 నుండి అమెజాన్.కామ్ లో అందుబాటులోకి రానుంది.