NewsOrbit
న్యూస్

నాయుడు గారి నాలుకను మడతెెట్టించిన ఏపీ పోలీసులు!

విశాఖ లో జరిగిన ఒక సంఘటనను సోషల్ మీడియాలో టిడిపి వక్రీకరించి చూపి అడ్డంగా జనాలకు దొరికిపోయింది.ఈ విషయంలో ప్రతిపక్ష నేత,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుక్కయ్యారు.

శనివారం విశాఖలో జరిగిన ఒక సంఘటనను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ అదంతా వైసిపి నేతల గూండాయిజం అన్నట్లు టిడిపి చిత్రీకరించింది.దీనికి ఏపీ పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు.తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కే పోలీసులు సలహా ఇవ్వడం జరిగింది.అసలు జరిగిందేమిటంటే శనివారం వైసిపి నేతలు,కార్యకర్తలు విశాఖపట్నం లో ఒక నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఒక సీఐపై వైసిపి గూండాలు దాడి చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఉద్ధృత ప్రచారం సాగించింది.రాష్ట్రంలో ఎక్కడ శాంతిభద్రతలు వున్నాయంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీసింది.

దీనిపై చంద్రబాబు ఆవేశంగా ఒక ట్వీట్ కూడా విసిరేశారు. అయితే వెనువెంటనే ఏపీ పోలీసులు స్పందించి అసలు విషయం వెల్లడించడంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తింది.టీడీపీ ఏ పోలీసు అధికారి పైనైతే వైసిపి గూండాలు దాడి చేశారని సోషల్ మీడియాలో టిడిపి పోస్ట్ చేసిందో అదే సీఐ ఇమ్మాన్యూల్ రాజు ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు.తనపై వైసిపి నేతలు దాడి చెయ్యలేదని నిజానికి వారు తనకు ఉపశమన చర్యలు చేశారని ఆయన చెప్పారు.

ఈ సంఘటనపై ఇమ్మాన్యూల్ రాజు వివరణ ఇస్తూ ‘నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్న వారిని టార్గెట్ చేసి వెనక్కి లాగుతాం..ఓ పర్సన్‌‌ని లాగే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో  తగిలి కిందపడిపోయానని,వెంటనే ప్రదర్శనకారులలో వున్న రమేశ్ అనే వ్యక్తి..వచ్చి తనను పైకి లేపి..తలకు గాయమైందా..అని చేయి పట్టి మసాజ్ చేశాడని తెలిపారు. అయితే..దీనికి సంబంధించిన ఫొటోను తీసుకుని అనవసరంగా..పోలీసులపై దాడి చేశారంటూ టిడిపి నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుందని ఇమ్మాన్యూల్ రాజు తెలిపారు . ఎవరు తప్పుచేసినా..చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.దీంతో తెలుగుదేశం పార్టీ నాలుక కరుచుకోక తప్పలేదు.

 

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju