మారుతున్న కాలాన్ని బట్టి ప్రతిఒక్కరు ఆధునికతకు మొగ్గు చూపుతున్నారు. చేతికి పెట్టుకునే వాచ్ నుండి అస్తమానం సమయం గడిపే ఫోన్ వరకు ప్రతిదీ స్మార్ట్ గా ఉండాలని చూస్తున్నారు ఈ కాలం యువత. స్మార్ట్ ఫోన్ దశను కరోనా మార్చిందని చెప్పవచ్చు గతంలో లేని అమ్మకాలు కరోనా లాక్ డౌన్ తీసేసిన తర్వాత జరిగాయి. దీనికి ముఖ్య కారణం డిజిటల్ పద్దతిలో విద్యబోధన. కరోనా వల్ల సగం మంది ఉద్యోగులు ఇంటినుండి పనిచేయడం వల్ల వీటి వినియోగం అధికమైంది. పండుగల వేళా ప్రతిఒక్కరు ఏదో ఒక కొత్త వస్తువు బడ్జెట్లో దొరికితే కోనుకుందాం అని చూస్తారు. అలా మీ బడ్జెట్ రూ.14వేలు ఉంటె ఈ ఫోన్లు కొనుకోవచ్చు.
ఈఏడాది నవంబర్‌లో విడుదలైన మోటో జీ9 స్మార్ట్‌ఫోన్ కొంతమేర సక్సెస్ అయింది. 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ తో రూ.11,999 ధరకు ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ఫిచర్స్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ ఫీచర్లతో లభిస్తుంది. మరో ఫోన్ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్. పూర్తి ఇండియా స్మార్ట్ ఫోన్ ఇది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఫీచర్లతో రెండు కలర్స్‌లో లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ 4జిబి ర్యామ్ +64జిబి ఇంటర్నల్ స్టోరేజ్. దీని ధర రూ.10,999కు ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసుకోవచ్చు.
ఈఏడాది భారీగా అమ్ముడుపోయిన మరో స్మార్ట్ ఫోన్ రియల్‌మి 7ఐ. రెండు కలర్లతో, 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ, 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్లతో లభిస్తున్న ధర రూ.11,999 కాగా, రియల్ మీ 6ఐ 4300 ఎంఏహెచ్ తో 6GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.13,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌లో లభించే రియల్ మీ 5ఐ 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 లకు కొనుక్కోవచ్చు. రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ నార్జో 20 ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో పాటుగా మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 48+8+2 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 వద్ద ఇవేకాక పోకో, ఇంఫినిక్స్, ఒప్పో కంపెనీ ఫోన్లు కూడా రూ.15వేల లోపు కొనుక్కోవచ్చు.