టిక్‌టాక్ బ్యాన్ అనంతరం దేశంలో అందుబాటులోకి వచ్చిన చింగారి యాప్ డౌన్‌లోడ్స్‌లో ప్రస్తుతం దూసుకుపోతోంది. ఆ యాప్ కేవలం 3 నెలల్లోనే 3 కోట్ల డౌన్లోడ్స్ను పూర్తి చేసుకుందని ఆ యాప్ డెవలపర్లు సోమవారం తెలిపారు. టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన 24 గంటల్లోనే చింగారి యాప్ 35 లక్షల డౌన్లోడ్స్ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ యాప్ ప్రస్తుతం డౌన్‌లోడ్స్‌లో శరవేగంగా దూసుకుపోతోంది.
ఈ సందర్బంగా చింగారి యాప్ కో ఫౌండర్, సీఈవో సుమిత్ ఘోష్ మాట్లాడుతూ చింగారి యాప్‌లో యూజర్లకు అత్యుత్తమమైన ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో యూజర్లకు అనేక రకాల వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే ఉత్తమమైన ఫిల్టర్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, దీంతో యూజర్లు నాణ్యమైన షార్ట్ వీడియోలను క్రియేట్ చేయవచ్చని అన్నారు.
చింగారి యాప్‌లో అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ఫిల్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయని, తమ యాప్ ను ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఉపయోగిస్తున్నారని సుమిత్ ఘోష్ తెలిపారు. కాగా ప్రస్తుతం చింగారి యాప్ 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ, తెలుగు, బంగ్లా, గుజరాతి, మరాఠి, పంజాబీ, మళయాళం, తమిళం, ఒడియా భాషల్లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక భారత్‌తోపాటు యూఏఈ, యూఎస్, కువైట్, సింగపూర్, సౌదీ అరేబియా, వియత్నాం దేశాల్లోనూ చింగారి యాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు.