NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

చేవెళ్ల సభలో అమిత్ షా సంచలన ప్రకటన ..వాళ్లకు రిజర్వేషన్ రద్దు అంటూ

చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. కేసిఆర్ సర్కార్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ అవినీతి పాలన సాగిస్తొందనీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 90 అసెంబ్లీ, 12 లోక్ సభ సీట్లే లక్ష్యంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

amit shah

 

కేసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలను మోడీ నుండి దూరం చేయలేరని అన్నారు. పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేస్తారా.. ఆయన ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు అని మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈటలను మాట్లాడనివ్వడం లేదన్నారు. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోందని, పేపర్ లీకేజీలపై ఇప్పటి వరకూ సీఎం కేసిఆర్ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదని అన్నారు.

ప్రధాని కావాలని కేసిఆర్ కలలు కంటున్నారనీ, 2024లో ప్రధాని సీటు ఖాళీగా లేదని కేసిఆర్ తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మోడీనే ప్రధాని అవుతారని అన్నారు. కేసిఆర్ ముందు సీఎం సీటు కాపాడుకోవాలన్నారు. ఎంఐఎంకు భయపడే కేసిఆర్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని అన్నారు. ఓవైసీ ఎజెండానే కేసిఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎంఐఎంకు బీజేపీ భయపడదని అమిత్ షా స్పష్టం చేశారు. కుటుంబ పాలనను తరిమికొట్టాలని అమిత్ షా పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న అమిత్ షా.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో కేసిఆర్ కుటుంబం ఇరుక్కుందని విమర్శించారు. ప్రజలు తమకు ఒక సారీ అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీని ఆశీర్వదిస్తే అంతా మంచే జరుగుతుందని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju