NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: సొంత గూటికి చేరిన తుల ఉమ .. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేటిఆర్

Share

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పక్క పార్టీలో చేరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోనూ జంపింగ్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

వేములవాడ బీజేపీ అభ్యర్ధిత్వాన్ని తొలుత ఆమెకు ఖరారు చేసిన పార్టీ అధిష్టానం.. చివరి నిమిషంలో బీఫామ్ ను మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావుకు ఇవ్వడంతో ఆమె తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ సమక్షంలో ఆమె గాలాబీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటిఆర్.

ఈటల రాజేందర్ వర్గంగా గుర్తింపు పొందిన తుల ఉమకు బండి సంజయ్ వల్లనే టికెట్ రాలేదన్న ప్రచారం జరిగింది. తాను స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటీలో నిలుస్తానని ప్రకటించిన తుల ఉమ.. తన నిర్ణయాన్ని మార్చుకుని బీఆర్ఎస్ లో చేరిపోయారు. గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో పని చేసి, జడ్పీటీసీగా, జడ్ పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన తుల ఉమ 2021 లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

ఇప్పుడు మరల బీఆర్ఎస్ గూటికి చేరారు తుల ఉమ. బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆమెతో సంప్రదింపులు జరిపారు. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ నేరుగా ఆమె నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆమె బీఆర్ఎస్ నేతల ఆహ్వానానికి మొగ్గు చూపారు.

Telangana Election 2023: కాంగ్రెస్ వాళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు భలే దొరికేశాడు(గా)..! గాయం అయ్యింది ఎక్కడ బాలరాజా..?


Share

Related posts

మహేష్ కోసం సరికొత్త క్యారెక్టర్ డిజైన్ చేసిన రాజమౌళి..??

sekhar

నిత్యం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..?

Srikanth A

raiza wilson Joshful looks

Gallery Desk