NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: తెలంగాణ బీజేపీలో తేలని సీట్ల పంచాయతీ .. మొదటి జాబితాపైనే కొనసాగుతున్న కుస్తీ

Share

Telangana Assembly Polls: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అభ్యర్ధుల ఎంపికలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొదటి విడతలోనే 115 మంది అభ్యర్ధులను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. రెండో జాబితాపై కసరత్తు కొనసాగిస్తొంది. బీజేపీ మాత్రం ఇంత వరకూ అభ్యర్ధుల మొదటి జాబితానే విడుదల చేయలేదు. దీంతో నేతలు అయోమయం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహన్, లక్ష్మణ్ తదితరులు హజరైయ్యారు.

bjp

రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై చర్చించారు. తెలంగాణ నుండి 55 మంది అభ్యర్ధులతో తొలి జాబితా సిద్దమైనట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే తమ వర్గానికి టికెట్లు దక్కించుకునేందుకు ముఖ్యనేతలు పట్టుపట్టడంతో మొదటి జాబితాపై కీలక నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అలకపూనడంతో మొదటి జాబితా విడుదల ఆగినట్లు తెలుస్తొంది. గోషామహాల్, మహబూబ్ నగర్, ధర్మపురి, చెన్నూరు, వరంగల్ వెస్ట్, అంబర్ పేట, ముషీరాబాద్ సీట్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా తమకు కేటాయించిన నియోజకవర్గాలను పలువురు సీనియర్లు మార్చమంటున్నారు. దీంతో కీలక నేతలు అడిగిన స్థానాలను అధిష్టానం పెండింగ్ లో పెట్టింది.

ఈ క్రమంలో ఆఖరినిమిషంలో మొదటి జాబితా విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలతో ఇన్ చార్జి లు జవడేకర్, సునీల్ బన్సల్ లు చర్చలు జరుపుతున్నారు. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు నేరుగా ఫోన్ లు చేసి టికెట్ ఖరారు అయినట్లుగా సమాచారం ఇస్తున్నారు. సీనియర్ ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈ రోజు ఏ సమయంలోనైనా బీజేపీ మొదటి లిస్ట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. టికెట్లు ఖరారు చేసిన అభ్యర్ధులకు కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవడేకర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. గెలుపు లక్ష్యంగా పూర్తి స్థాయిలో పని చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సారి ఎన్నికల్లో ఎంపీల్లో కిషణ్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు బీజేపీ ఎంపీలు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుండి బండి సంజయ్, బోధ్ నుండి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, కోరుట్ల నుండి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లు పోటీ చేయనున్నారు. సీనియర్ నేత ఈటల రాజేందర్ హూజరాబాద్ తో పాటు సీఎం కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుండి కూడా బరిలోకి దిగనున్నారు. సీఎం పోటీ చేస్తున్న మరో స్థానం కామారెడ్డి నుండి విజయశాంతి పోటీకి సిద్దమవుతున్నారని అంటున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు అభ్యర్ధులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బోథ్ నుండి సోయం బాపురావు, నిర్మల్ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ నుండి రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ నుండి పాయల్ శంకర్, సిర్పూర్ నుండి పాల్వాయి హరీష్ బాబు, బెల్లంపల్లి నుండి అమరాజుల శ్రీదేవి అభ్యర్ధిత్వాలు ఖరారు కావడంతో కిషన్ రెడ్డి వారికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేసినట్లు సమాచారం. కాగా మొదటి జాబితాపై కుస్తీ పూర్తి అయితే ఈ రోజు ఏ క్షణమైనా విడుదల కావచ్చని తెలుస్తొంది.

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ


Share

Related posts

‘ప్రభుత్వం అప్పులు చేస్తోంది’

sarath

‘అన్నింటా పర్సంటేజీలే’

somaraju sharma

Samantha: సమంతతో రోజూ జిమ్ చేయించే ఆ కుర్రాడు.. సమంత బాడీ గురించి అలా అనేశాడు ఏంటి!

Ram