NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: సీఎం హోదాలో మొదటి సారి హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ..ఎందుకంటే..?

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సీఎం గా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరో పది మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరింది. రేవంత్ రెడ్డి పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ పేరును జ్యోతిరావుపూలే ప్రజాభవన్ గా మార్చి ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చెప్పినట్లుగా ఇవేళ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ తర్వాత సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

కాగా, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారిగా ఇవేళ ఢిల్లీకి పయనమై వెళ్లారు. మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన చర్చించనున్నారు. 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు దాటినా ఇంత వరకూ శాఖలు కేటాయింపు జరగలేదు. పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోనూ రేవంత్ భేటీ కానున్నారు. అయితే ఢిల్లీ తొలి పర్యటనలో రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారా లేదా అనే దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎం మోడీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేస్తూ కేంద్రం నుండి రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

మోడీ ట్విట్ కు రేవంత్ స్పందిస్తూ ధన్యవాదాలు కూడా తెలిపారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి, కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై ఒక సారి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత ప్రధాని మోడీని కలుస్తురా లేక ఇవేళ పీఎం అపాయింట్మెంట్ కోరతారా అనేది వేచి చూడాలి. మరో పక్క కాంగ్రెస్ అగ్రనేతల భేటీలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా అంశంపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల పేర్కొంటున్నాయి.

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?