NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

The Archies Review: బాలీవుడ్ ప్రముఖ తారలు షారుక్, శ్రీదేవి, అమితాబ్ కుటుంబాలకు చెందిన పిల్లలు నటించిన..”ది ఆర్చీస్” సినిమా రివ్యూ..!!

The Archies Review: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో “ది ఆర్చీస్” అనే చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలయ్యింది. శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్.. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాలో షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో అమితాబ్ మనవడు అగస్త్య నంద కూడా నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ తారల పిల్లలు కావడంతో ఈ సినిమా సెన్సేషన్ గా మారింది. “ది ఆర్చీస్” నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఈ క్రమంలో  డిసెంబర్ 5వ తారీఖు ముంబైలోని నేత ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోకి జాన్వి కపూర్ తో పాటు బాలీవుడ్ లో చాలామంది ప్రముఖ తారలు హాజరయ్యారు. శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కి… తొలి చిత్రం కావటంతో తల్లి శ్రీదేవి అప్పట్లో ధరించిన డ్రెస్ వేసుకొని.. ప్రీమియర్ కి రావడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు షారుక్, శ్రీదేవి, అమితాబ్ కుటుంబాలకు చెందిన నటులు అరంగేట్రం చేసిన “ది ఆర్చీస్” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఈ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం..

Review of The Archies movie starring sons of Bollywood star families
Review of The Archies movie starring sons of Bollywood star families

స్టోరీ:

“ది ఆర్చీస్” సినిమాను 1964వ సంవత్సరంలో జరిగిన కథగా తెరకెక్కించారు. బాల్యం తర్వాత టీనేజ్ వయసులో జరిగిన సంఘటనల ఆధారంగా.. ఒక పార్కు చుట్టూ తిరిగే కథ. ఉత్తర భారత దేశంలో .. కొండ ప్రాంతాలలో.. ఒక అందమైన పార్కు చుట్టూ కొన్ని కుటుంబాలు ఎప్పటినుండో జీవిస్తూ ఉంటాయి. ఆ కుటుంబాలకు చెందిన వాళ్లు అక్కడ ఒక గ్రూప్..గా ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఉంటారు. ఆండ్రూస్(అగస్త్య నంద), బేటి కాపర్ (ఖుషి కపూర్), వేరోనికా(సుహానా ఖాన్), రెగీ మంట్లే(వేదంగ్ రైనా), జగ్హీడ్ జోన్స్(మిహిర్ అహుజ), ఎతెల్ మగ్స్(అదితి సైగల్), డోలి(యువరాజ్ మెంద).. వీళ్లంతా కొండ ప్రాంతంలో బ్రతుకుతూ కలసికట్టుగా నివసిస్తారు. ముఖ్యంగా కొండ ప్రాంతంలో మధ్యలో ఉండే పార్క్ చెట్లమధ్య వీళ్లు చిన్ననాటి నుండి ఆడుకుంటూ పెరుగుతూ.. దానొక అద్భుతమైన ప్లేస్ గా ఫీల్ అవుతారు. జీవితం సజావుగా చక్కగా సాగుతున్న సమయంలో వేరోనికా వాళ్ళ తండ్రి.. ఆ పార్కులో ఉన్న చెట్లు కొట్టేసి పార్క్ మొత్తం ధ్వంసం చేసి.. ఒక పెద్ద హోటల్ కట్టించాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయంతో కొంతమంది జీవనోపాధి అక్కడ కోల్పోవడం జరుగుతుంది. అయితే కలిసిమెలిసిగా ఉన్న ఈ గ్రూపు సభ్యులంతా ఎవరికి వారు విడిపోతారు. వేరోనికా తండ్రి వల్లే తమ జీవితాలు రోడ్డున పడ్డాయని చాలామంది కోపం పెట్టుకుంటారు. కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఫ్రెండ్స్ అంతా కలిసి తిరిగి పార్క్ కాపాడుకునే పరిస్థితికి వస్తది. ఈ క్రమంలో స్నేహంలో విడిపోతే ఏమవుతుంది..? అందరు కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేదే “ది ఆర్చీస్” కథ.

Review of The Archies movie starring sons of Bollywood star families
Review of The Archies movie starring sons of Bollywood star families

విశ్లేషణ:

“ది ఆర్చీస్” సినిమా నిడివి మొత్తం రెండు గంటల 23 నిమిషాలు. దర్శకుడు జొయా అక్తర్… తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు నటించడం ఆసక్తికరంగా మారింది. అయితే సినిమా చాలా స్లోగా ఉంటుంది. స్టోరీలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. చాలా సింపుల్ స్టోరీ. సినిమాకి పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే. హిల్ స్టేషన్ కి సంబంధించి స్టార్టింగ్ లో యానిమేషన్ పరంగా వివరించే విధానం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ లో.. 40 నిమిషాలు సాగదీసే విధంగా సినిమాని నడిపించారు. అనవసరమైన పాటలు చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. గ్రీన్ పార్క్ తీసేయకూడదని స్టూడెంట్స్ చేసే పోరాటాలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. అయితే సినిమాలో ప్లస్ పాయింట్స్ పరంగా చెప్పుకుంటే పాత్రలకు సంబంధించిన కాస్ట్యూమ్స్ 1960 టైములో ఉండే వాతావరణాన్ని సెట్స్ పరంగా అద్భుతంగా చూపించడం జరిగింది. అయితే స్టోరీ మరియు స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో పాత్రలు ఎంత బాగా నటించినా గానీ.. ఆకట్టుకోలేక పోవడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా తారల పిల్లలు అయినా గాని ఒక సన్నివేశంలో అద్భుతంగా నటించారు అని చెప్పడానికి చెప్పుకోదగ్గ సీన్ ఏమీ లేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా తెలుగు డబ్ 2 వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella