NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా

Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీకి సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Chandrababu

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పిటిషన్ పై గతంలో వాదనలు విన్న ధర్మాసనం ..తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. ఈరోజు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసన పిటిషన్ పై మరో సారి విచారణ చేపట్టింది.పిటిషన్ పై విచారణ సందర్భంలో స్కిల్ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని సాల్వే కోరారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేయగా, కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్దంగానే ఉన్నామని సాల్వే తెలిపారు. అయితే ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని సాల్వే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

సాల్వే వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం .. విచారణ జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. అయితే తేదీ ఖరారు చేయాలాని సాల్వే ధర్మాసనాన్ని కోరగా, ఆయన విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జనవరి 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఆ కౌంటర్ కు రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

APPSC: తెలంగాణ అభ్యర్ధులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేయవచ్చా ..? నాన్ లోకల్ రిజర్వేషన్ ఎంత..?

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri