ప్రేమ్ ఒక్క ఓటు తేడాతో గెలుస్తాడు.. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి స్టేజ్ మీద కి రమ్మని ఇన్వైట్ చేస్తారు.. ప్రేమ్ తనకు వచ్చిన ట్రోఫీ నీ తనకు కాకుండా తన అమ్మకి ప్రెజెంట్ చేయమని అడుగుతాడు.. ఇక కలెక్టర్ చేతుల మీదుగా తులసి అవార్డ్ తీసుకుంటుంది.. నేను తల్లిగా ఓడిపోయాను అంటూ ఒక పెద్ద మనిషి నా మీద నిందలు వేశారు.. ఇప్పటికీ అలాగే అనిపిస్తే ఈ స్టేజ్ మీద కు వచ్చి చెప్పచ్చు అని అంటుంది తులసి నందును చూస్తూ.. దాంతో నందు మౌనంగా ఉండిపోతాడు.. ఇక కంగ్రజూలేషన్స్ అంటూ అంతా చెబుతుండగా.. అంతలో నందు వచ్చి కంగ్రాట్స్ చెప్పి నీ విలువ నాకు ఈ రోజు తెలిసింది అని అంటాడు.. ఇక అక్కడ నుంచి నందు మౌనంగా వెళ్ళిపోతాడు..
తులసి తన పిల్లలను చెక్క బొమ్మలలో చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది.. అభి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు.. కానీ ఈ అమ్మ ప్రేమించినంతగా నిన్ను ఎవరు ప్రేమించరు రా అని అంటుంది.. అంతలో తులసి దగ్గరకు వచ్చి అనసూయమ్మ నేను నీ చేత . బోనం ఎత్తిస్థానం అని అనుకుంటున్నాను అని చెబుతుంది.. తప్పకుండా రేపు భోనం ఎత్తుతాను అత్తయ్య అని అంటుంది.. మన సంతోషం కోసం తప్పకుండా చేస్తాను అని అంటుంది తులసి..
ఇక అక్కడికి అభి కూడా వస్తాడు.. తులసి ఇండైరక్ట్ గా అభిని పలకరిస్తుంది.. అభి కస్సు కస్సు మంటు ఉంటాడు.. ఈ అమ్మ మీద ఇంకా ద్వేషం మర్చిపోలేద అని అడుగుతుంది అభిని.. గుడి కదా కాసేపు మర్చిపోయాను అని అంటాడు అభి.. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అంటాడు అభి.. అన్ని మర్చి పోయి పిలవగానే వచ్చినందుకు థాంక్యూ అని అంటుంది తులసి.. అంతలో గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధర , సాక్షి అక్కడ కనిపిస్తారు..
రిషి సార్ నీ నాకు దక్కేలా చేయమని ఆ అమ్మవారికి బోనం ఎత్తుదాం అనుకున్నాను ఈ విషయం సాక్షికి ఎలా తెలిసింది అని అనుకుంటుంది.. మరోవైపు తులసి వీళ్లిద్దరు నీ గమనిస్తుంది.. ఏంటి బోనం ఎత్తడానికి వచ్చి ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూస్తున్నారు అని తులసి అడుగుతుంది.. ఇద్దరిలో ఏ ఒక్కరికి బోనం ఎత్తడం రాదని తెలిసి తులసి వాళ్ళకి బోనం ఎత్తడం ఎలాగో చెబుతుంది.. చాలా థ్యాంక్స్ అని అంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి ఎత్తే బోనం ఆ అమ్మవారికి సమర్పించుకుండా అడ్డుకోవాలి అని అనుకుంటుంది లాస్య.. కానీ తులసి ఆ అమ్మవారికి బోనం సమర్పిస్తుంది..