Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. తాజాగా విడుదలైన సీరియల్ టి ఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.. ఇంటింటి గృహలక్ష్మి కార్తీకదీపం సీరియల్ కు గట్టిపోటీని ఇస్తుంది.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్య మలుపులు తిరుగుతూ వీక్షకులను అలరిస్తున్నాయి.. ఈ వారం జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందంటే.!?
తులసి లాస్య ప్లాన్ ను తెలుసుకుంటుంది. తులసి నువ్వు నా ప్లాను తెలుసుకున్న కూడా నువ్వు ఏమి చేయలేవు. ఎందుకంటే నువ్వు అంకిత ను నీ నుంచి దూరం చేసుకున్నావు. ఇప్పుడు అభి, అంకిత మేము చెప్పినట్లు వింటారు. మా చేతిలో గాయత్రి ఉంది. ఇక రాజ్యం నాది అన్నట్టుగా లాస్య మాట్లాడుతుంది. ఎవరు ఎన్ని తప్పులు చేసినా నిజాన్ని మాత్రం దాచలేరు. ఎప్పటికైనా నిజం బయట పడుతుంది అని తులసి అంటుంది. నా పిల్లల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే.. వాళ్ళు ఎవరైనా సరే నేను సహించను అని వార్నింగ్ ఇస్తుంది తులసి.
తులసి దగ్గర జరిగిన గొడవంతా లాస్య నందుకు చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న నందు తులసి మీద గొడవ పడటానికి వస్తాడు. అవసరమైతే నా పిల్లల్ని దూరం చేస్తున్నవని.. నా పిల్లలు నాకు దక్కకుండా చేసినందుకు నీ మీద కేసు పెడతాం అని నందు తులసిని బెదిరిస్తాడు. నీకు చేతనైనది నువ్వు చేసుకో నాకు చేతనైంది నేను చేసి చూపిస్తాను అని తులసి అంటుంది. అలా పెద్ద గొడవ జరుగుతుంది. తులసి అంకితను దూరం పెట్టడానికి వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణమని తెలుసుకుంటుంది. వచ్చే వారం ఇదే హైలెట్ సీన్ కానుంది. తులసి మరోసారి మంచి అత్తగారుగా ప్రూవ్ చేసుకుంటుంది . దాంతో టిఆర్పి రేటింగ్ పిక్స్ లోకి వెళ్తుంది.